T20 World Cup 2024: పంత్ వీరవిహారం.. హార్దిక్ దుమ్ము దుమారం.. బంగ్లా ముందు భారీ టార్గెట్..

రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 32 బంతుల్లో 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అర్థ సెంచరీ చేసిన తర్వాత అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. పంత్ అనంతరం హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా తరఫున సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేశాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 7:12 am

T20 World Cup 2024

Follow us on

T20 World Cup 2024: ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ లో భాగంగా శనివారం అమెరికా వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో భారత్ ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. టి20 టోర్నీలో ఇది చివరి ప్రాక్టీస్ మ్యాచ్. ఈ మ్యాచ్లో భారత ఆటగాళ్లలో సంజు సాంసన్ మినహా మిగతా వారంతా రాణించారు.. ముఖ్యంగా రిషబ్ పంత్ ఆకాశమేహద్దుగా చెలరేగిపోయాడు. మెరుపు అర్థ సెంచరీ సాధించాడు.. 18 నెలలపాటు క్రికెట్ కు దూరమైనప్పటికీ.. అతడు ఏమాత్రం ఇబ్బంది పడలేదు. మైదానంలో ఉన్నంత సేపు బంగ్లా బౌలర్లను ఉరుకులు పరుగులు పెట్టించాడు.. ఫలితంగా మెరుపు వేగంతో అర్ధ సెంచరీ ఆడించాడు. సూర్య కుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మ కూడా రాణించడంతో.. టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 182 రన్స్ చేసింది. టీమిండియా నుంచి ఏడుగురు ఆటగాళ్లు బ్యాటింగ్ చేశారు. ఇందులో సంజు మాత్రమే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. మిగిలిన ఐదుగురు ఆటగాళ్లు రెండు అంకెల పరుగులు చేశారు.

రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో 32 బంతుల్లో 53 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అర్థ సెంచరీ చేసిన తర్వాత అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగాడు. పంత్ అనంతరం హార్దిక్ పాండ్యా టీమ్ ఇండియా తరఫున సెకండ్ హైయెస్ట్ స్కోర్ చేశాడు. పాండ్యా 23 బంతుల్లో నాలుగు సిక్స్ లు, రెండు ఫోర్ లతో 40 పరుగులు చేశాడు. సూర్య కుమార్ యాదవ్ 18 బంతుల్లో 31 రన్స్ చేశాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 19 బంతుల్లో 23 పరుగులు చేశాడు. శివం దూబే 16 బంతుల్లో 14 పరుగులు చేశాడు. ఇక బంగ్లాదేశ్ జట్టు ఏకంగా 8 మంది బౌలర్లతో బౌలింగ్ చేయించింది. హసన్, మామదుల్లా, షోరీ ఫుల్ ఇస్లాం, తన్వీర్ ఇస్లాం..తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.

సంజు ఒక్క పరుగు చేసి అవుట్ అయినప్పటికీ.. రోహిత్ శర్మ దాటిగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరుకున్నప్పటికీ.. రిషబ్ పంత్ దూకుడుగా ఆడాడు. బౌలర్ ఎవరనేది లక్ష్య పెట్టలేదు. అతని ఆట చూస్తుంటే.. రోడ్డు ప్రమాదానికి గురైంది ఇతడేనా.. 18 నెలల పాటు క్రికెట్ కు దూరమైంది ఇతడేనా.. అని అందరికీ అనిపించింది. ముఖ్యంగా వికెట్ల మధ్యలో రిషబ్ పంత్ అత్యంత సులభంగా పరిగెత్తాడు. బంగ్లా బౌలర్లపై ప్రారంభం నుంచే ఎదురు దానికి దిగాడు. ఓపెనర్లు వెంటవెంటనే అవుట్ అయినప్పటికీ.. రిషబ్ పంత్ గట్టిగా నిలబడటంతో భారత్ భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ముందు ఉంచింది.