India Vs USA: ప్చ్ అమెరికా..ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ వేరే విధంగా ఉండేది..

టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ కుమార్ 27, టేలర్ 24 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 13, 2024 8:44 am

India Vs USA

Follow us on

India Vs USA: టి20 వరల్డ్ కప్ లో భాగంగా బుధవారం న్యూయార్క్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. బౌలింగ్ లో అర్ష్ దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా, బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్, శివం దూబే, రిషబ్ పంత్ ఆకట్టుకోవడంతో భారత్ గెలుపు బాట పట్టింది.

టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. ఆ జట్టులో నితీష్ కుమార్ 27, టేలర్ 24 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ నాలుగు, పాండ్యా 2, అక్షర్ పటేల్ ఒక వికెట్ తీసి ఆకట్టుకున్నారు.

అమెరికా విధించిన 111 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి చేదించింది. సూర్య కుమార్ యాదవ్ అజేయ అర్థ సెంచరీ సాధించాడు. శివం దూబే 31 పరుగులతో చివరి వరకు నిలిచాడు. అమెరికా బౌలర్లలో సౌరభ్ రెండు వికెట్లు, ఆలీ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఈ గెలుపు ద్వారా టీమిండియా సూపర్ -8 కు వెళ్ళింది. ఇప్పటివరకు సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సూపర్ -8 కు వెళ్లాయి. ఇప్పుడు ఆ జాబితాలో టీమిండియా కూడా చేరింది.

భారత ఇన్నింగ్స్ సమయంలో సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ ను సౌరభ్ నేత్రావల్కర్ వదిలేయడం, కీలక సమయంలో పెనాల్టీ రూపంలో ఐదు పరుగులు సమర్పించుకోవడంతో అమెరికా చేజేతులా తన విజయావకాశాలను కోల్పోయింది. ఒకవేళ గనుక సౌరభ్ ఆ క్యాచ్ పట్టి ఉంటే మ్యాచ్ పరిస్థితి మరో విధంగా ఉండేది.. అంతేకాకుండా ఐసీసీ రూల్ పాటిస్తే 5 పరుగుల పెనాల్టీ పడేది కాదు.. ఈ రెండు తప్పిదాలే అమెరికా కొంపముంచాయి.. భారత జట్టుకు ఆయాచిత వరం లాగా మారాయి. ఎప్పుడైతే ఐదు పరుగులు పెనాల్టీ రూపంలో వచ్చాయో.. అప్పుడే టీమిండియా బ్యాటర్లు స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టారు. సూర్య కుమార్ యాదవ్, శివం దూబే దూకుడుగా ఆడటంతో టీమిండియా విజయం సాధించింది. సూపర్ -8 కు వెళ్లిపోయింది.