Horoscope Today: ఈ రాశివారు ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి..

Horoscope Today: 2024 జూన్ 13 గురువారం రోజున ద్వాదశ రాశులపై పూర్దపాల్గుణి నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు.

Written By: Srinivas, Updated On : June 13, 2024 8:48 am

Horoscope Today

Follow us on

Horoscope Today: 2024 జూన్ 13 గురువారం రోజున ద్వాదశ రాశులపై పూర్దపాల్గుణి నక్షత్రాల ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో శ్రీహరి ప్రత్యేక యోగం ఉండనుంది. మేషం నుంచి 12 రాశుల వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో చూద్దాం..

మేష రాశి:
స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోవాలి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది.

వృషభ రాశి:
కొన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొన్ని రంగాల వారికి కష్టాలు ఉంటాయి.

మిథున రాశి:
కొత్త పనులు ప్రారంభిస్తారు. సీనియర్ల నుంచి మద్దతు ఉంటుంది. రాజకీయాలకు సంబంధించిన వారు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులు, కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి:
భవిష్యత్ కోసం ప్రణాళికలు చేపడుతారు. విద్యార్థులు కెరీర్ కు సంబందించిన విషయాలపై ఆలోచిస్తారు. ఉద్యోగులు హక్కుల కోసం పోరాడుతారు.

సింహారాశి:
ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. వ్యాపారుల లాభాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

కన్య రాశి:
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. భవిష్యత్ కోసం ప్రణాళికలు వేస్తారు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.

తుల రాశి:
జీవిత భాగస్వామి నుంచి బహుమతిని పొందుతారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. వ్యాపారులు సంతోషంగా ఉంటారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం అవుతాయి.

వృశ్చిక రాశి:
ఖర్చులు పెరిగిపోతాయి. ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వ సంస్థ నుంచి ప్రయోజనాలు పొందుతారు. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

ధనస్సు రాశి:
ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి.

మకర రాశి:
ధైర్య సాహసాలు చేస్తారు. ప్రత్యర్థుల బెడద ఎక్కువగా ఉంటుంది. నిరాశ ఆలోచనలకు దూరంగా ఉండాలి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.

కుంభరాశి:
కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ప్రభుత్వ ఉద్యోగులు బదిలీ అయ్యే అవకాశం ఉంది.

మీనరాశి:
కొన్ని రంగాల వారు సమస్యలు ఎదుర్కొంటారు. ప్రియమైన వారితో సంతోషంగా ఉంటారు. అసంపూర్తి పనులు కొనసాగుతాయి. అనుకూలమైన వాతావరణం ఉంటుంది.