India U 19 vs UAE U19: దుబాయ్ వేదికగా అండర్ 19 ఆసియా కప్ జరుగుతోంది. ఈ టోర్నీలో టీమిండియా అదరగొట్టింది. తొలి మ్యాచ్ జట్టును ఏకంగా 234 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. టీమిండియాలో వైభవ్ సూర్య వంశీ 95 బంతుల్లో 171 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 బౌండరీలు, 14 సిక్సర్లు ఉన్నాయి.
వైభవ్ విశ్వరూపం నేపథ్యంలో టీమిండియా ఏకంగా ఆరు వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసింది. టీమిండియా విధించిన భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో యూఏఈ జట్టు 7 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఉద్దిశ్ సూరి 78*, పృద్వి 50 పరుగులతో ఆకట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయింది. భారత బౌలర్లలో దీపేష్ రెండు వికెట్లు పడగొట్టాడు. కిషన్ కుమార్, హెనీల్ పటేల్, కిలాన్ పటేల్, విహాన్ తలా ఒక వికెట్ సాధించారు.
అంతకుముందు టీమిండియా బ్యాటింగ్లో వైభవ్ తన విశ్వరూపం చూపించాడు. ఆరోన్ జార్జి 69, విహాన్ మల్హోత్రా 69 పరుగులు చేశారు. వేదాంత త్రివేది 38 పరుగులు చేసి పర్వాలేదు అనిపించాడు. కెప్టెన్, ఓపెనర్ ఆయుష్ మాత్రే(4) దారుణంగా విఫలమయ్యాడు. చివర్లో కాన్షిక్ 28, అభిజ్ఞాన్ కుందు 32 పరుగులు చేశారు. దీంతో టీమ్ ఇండియా 433 పరుగులు చేసింది. యూఏఈ భౌలర్లలో సూరి, యుగ్ శర్మ చెరి రెండు వికెట్లు సాధించారు. షలోము, యాయిన్ తలా ఒక వికెట్ సాధించారు.
వైభవ్ సూర్య వంశీ ప్రారంభం నుంచి చివరి వరకు ఒకే తిరుగా బ్యాటింగ్ చేశాడు. మంచినీళ్లు తాగినంత ఈజీగా సిక్సర్లు కొట్టాడు.. అతడు ఇన్నింగ్స్ లో ఫోర్ ల కంటే సిక్సర్లు అధికంగా ఉండడం విశేషం. అతడిని అవుట్ చేయడానికి యూఏఈ కెప్టెన్ ఎంతమంది బౌలర్లను ప్రయోగించినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. తనకు మాత్రమే తెలిసిన శక్తివంతమైన బ్యాటింగ్ తో వైభవ్ అదరగొట్టాడు. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. భారత జట్టు సాధించిన భారీ స్కోరులో సూర్యవంశీ ది కీలకపాత్ర. 95 బంతుల్లో అతడు 171 పరుగులు చేశాడంటే.. అతడి బ్యాటింగ్ స్థాయి ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఒకానొక దశలో అతడు డబుల్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నారు.. కానీ ఊహించని విధంగా అవుట్ కావడంతో ద్వి శతకం కలను నెరవేర్చుకోలేకపోయాడు. అంత భారీ స్కోర్ చేసినప్పటికీ.. సూర్య వంశీ నిరాశతోనే మైదానాన్ని వీడి వెళ్లిపోవడం విశేషం.