India Women Vs West Indies Women: రెండో వన్డేలో హర్లిన్ డియోల్ సెంచరీ తో కదం తొక్కింది. తొలి వన్డే సెంచరీ చేసి భారత జట్టును గెలిపించింది.. హర్లిన్ చేసిన సెంచరీ ద్వారా టీమిండియా అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ఐలాండ్ జట్టుతో 2017లో జరిగిన ఓ మ్యాచ్లో టీమిండియా ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. సరిగ్గా ఏడు సంవత్సరాల కు మళ్ళీ టీమిండియా అదే స్థాయిలో స్కోర్ చేసింది. వెస్టిండీస్ పై చేసిన 358 పరుగులు టీమిండియా కు సెకండ్ హైయెస్ట్ స్కోర్ గా ఉంది.
ఈ ఏడాది మూడు సందర్భాలు..
ఈ ఏడాది భారత మహిళల జట్టు వన్డేలలో 300 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలు మూడు. ఒక క్యాలెండర్ ఇయర్ లో భారత మహిళల జట్టుకు ఇదే అత్యధికం. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న సిరీస్లో మొదటి వన్డేలో 9 వికెట్ల నష్టానికి భారత మహిళల జట్టు 314 పరుగులు చేసింది. రెండవ వన్డేలో 358 పరుగులు చేసింది. ఇలా వర్షం మ్యాచ్లో 300+ స్కోర్ నమోదు చేసిన తొలి జట్టు భారత్.
47 బౌండరీలు కొట్టారు
వడోదర వన్డేలో భారత ప్లేయర్లు 47 బౌండరీలు కొట్టారు. ఇందులో ఫోర్లు 43, సిక్సర్లు నాలుగు ఉన్నాయి. ఒక వన్డేలో భారత ప్లేయర్లు 47 బౌండరీలు చేయడం ఇదే తొలిసారి.
50 కి పైగా పరుగులు చేయడం ఇది రెండవసారి
ఒక వన్డేలో నలుగురు భారత బ్యాటర్లు 50 కి పైగా పరుగులు చేయడం ఇది రెండవసారి.. ముగ్గురు బ్యాటర్లు 50కి పైగా పరుగులు చేయడం ఇది మూడవసారి. 2021లో లక్నోలో దక్షిణాఫ్రికాపై జరిగిన మ్యాచ్లో పూనమ్ రౌత్ 104* పరుగులు చేసింది. అప్పట్లో అది రికార్డుగా ఉండేది. హర్లిన్ డియోల్ వడదరాలో సెంచరీ చేయడం ద్వారా.. వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన మూడవ బ్యాటర్ గా నిలిచింది..
98 బంతుల్లోనే సెంచరీ
వడోదర వన్డేలో సెంచరీ చేసిన డియోల్.. 100 కంటే తక్కువ బంతుల్లో సెంచరీ చేసిన రెండవ భారతీయ ప్లేయర్ గా నిలిచింది. 98 బంతుల్లోనే డియోల్ ఈ ఘనతను సాధించింది.
శతక భాగస్వామ్యాలు
స్మృతి, ప్రతీక వన్డేలలో వరుసగా శతక భాగస్వామ్యాలు సాధించిన మూడవ భారతీయ జోడిగా నిలిచారు. అంజు, జయ శర్మ 2003, 2004 లో వరుసగా శతక భాగస్వామ్యాలు నిర్మించారు. 2005లో కరుణ జైన్, జయ శర్మ సెంచరీ పార్ట్నర్షిప్ నెలకొల్పారు.
స్మృతి హైయెస్ట్ స్కోర్
ఈ ఏడాది వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన మహిళా బ్యాటర్ గా స్మృతి మందాన నిలిచింది. ఈఏడాది ఆమె ఇప్పటివరకు 743 పరుగులు చేసింది. తద్వారా దక్షిణాఫ్రికాకు చెందిన లారా ను స్మృతి అధిగమించింది. ఈ ఏడాది ముగిసేలోపు స్మృతి మరో వన్డే మ్యాచ్ అడాల్సి ఉంది. ఒకవేళ ఆ మ్యాచ్లో స్మృతి హాఫ్ సెంచరీ లేదా సెంచరీ చేస్తే.. ఈ ఏడాది వన్డేలలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా ఆమె రికార్డు సృష్టిస్తుంది.