https://oktelugu.com/

Harleen Deol: టీమిండియా కు మరో మిథాలీ దొరికేసింది!.. సాన పెడితే వజ్రం అవుతుంది..

టీమిండియా మహిళల క్రికెట్ జట్టులో మిథాలీ రాజ్ కు ప్రత్యేక చరిత్ర ఉంది. ఆమె సృష్టించిన రికార్డులు చెక్కు చెదరకుండా ఉన్నాయి. అందువల్లే ఆమెను మహిళా క్రికెట్ గాడెస్ అని పిలుస్తుంటారు. ఆమె క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంది.. అది జరిగి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ.. ఆమె స్థానాన్ని భర్తీ చేసే మహిళా క్రికెటర్ రాలేదు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : December 25, 2024 / 10:01 AM IST

    Harleen Deol

    Follow us on

    ఈ ప్రశ్నకు సమాధానం చెబుతూ.. నేను ఉన్నానని పేర్కొంటూ హార్లీన్ డియోల్ రంగంలోకి వచ్చింది. వెస్టిండీస్ జట్టుతో ఆడిన వన్డే మ్యాచ్లో.. తొలి శతకం సాధించింది. వెస్టిండీస్ జట్టుతో జరిగిన రెండవ వన్డేలో.. వడోదరా మైదానంలో హర్లిన్ అదరగొట్టింది. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న భారత స్మృతి, ప్రతీక దూకుడుతో మెరుగైన స్కోర్ సాధించింది. ఈ క్రమంలో స్మృతి, ప్రతీక తొలి వికెట్ కు 110 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔట్ కావడంతో స్కోర్ వేగం మందగించింది. ఈ క్రమంలో డియోల్ బ్యాటింగ్ కు చేసేందుకు వచ్చింది. ప్రారంభంలో ఆమె నిదానంగా ఆడింది. ఆచి తూచి పరుగులు చేసింది. 52 బంతుల్లో 34 రన్స్ మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత తనలో ఉన్న ఆటను ఒక్కసారిగా హార్లిన్ డియోల్ బయటికి తీసింది. వరుసగా మూడు బౌండరీలు కొట్టి స్కోర్ బోర్డులో వేగం పెంచింది. ఇదే క్రమంలో హర్మన్ ప్రీత్ అవుట్ అయ్యింది. ఆ తర్వాత జెమీమా రోడ్రిగ్స్ క్రీజ్ లోకి వచ్చింది. ఏడు బంతుల్లో ఆరు బౌండరీలు కొట్టింది. ఇదే సమయంలో డోటిన్ వేసిన ఒక ఓవర్లో హార్లిన్ డియోల్ మూడు ఫోర్లు కొట్టింది. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ చేసిన జెమీమా అవుట్ అయింది. అయితే హార్లిన్ క్రీజ్ లో ఉండడంతో.. భారత్ చివరి 10 ఓవర్లలో 109 పరుగులు చేసింది. ఫలితంగా వన్డేలలో భారత్ రెండవసారి 350+ స్కోర్ చేయడంలో సహాయపడింది.

    అదరగొట్టింది

    భారత్ విధించిన 350+ స్కోప్ టార్గెట్ ను చేదించడంలో వెస్టిండీస్ రంగంలోకి దిగింది. వెస్టిండీస్ ప్లేయర్ మాథ్యూస్ పోరాటం చేసినప్పటికీ.. మిగతా ఎండ్ లో ఆమెకు సహకారం లభించలేదు.. భారత బౌలర్లు వెస్టిండీస్ ప్లేయర్లు కియానా జోసెఫ్, క్రాప్టన్, విలియమ్స్, డాటిన్ ను త్వర త్వరగానే పెవిలియన్ పంపించారు. ఫలితంగా వెస్టిండీస్ 69 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.. ఈ దశలో మాథ్యూస్, షైమన్ 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే ఆ తర్వాత ఎందుకనో వీరిద్దరూ వేగం తగ్గించారు.. ఇదే క్రమంలో సాధు బౌలింగ్లో షైమన్ అవుట్ కావడంతో.. వెస్టిండీస్ స్కోర్ లో వేగం తగ్గింది.. మరో ఎండ్ లో మాథ్యూస్ ఉన్నప్పటికీ.. ఆమెకు మిగతా ప్లేయర్ల నుంచి సహకారం లభించకపోవడంతో వెస్టిండీస్ ఓటమి పాలు కాక తప్పలేదు. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 358 పరుగులు చేసింది. హర్లిన్ డియోల్ 115 పరుగులు చేసింది. ప్రతీక రావల్ 76 పరుగులు సాధించింది. ఆఫీ ప్లెచర్ 1-38 తో అదరగొట్టింది.. వెస్టిండీస్ జట్టు 243 పరుగులకు కుప్ప కూలింది. 115 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. హెలి మాథ్యూస్ 106, షైమైన్ 38 పరుగులతో ఆకట్టుకున్నారు. రావల్ 2 వికెట్లు పడగొట్టింది. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్.. వడోదర వన్డే లోనూ అదే జోరు కొనసాగించింది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ దక్కించుకుంది.

    సాన పెడితే..

    ఈ మ్యాచ్లో హర్లిన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. మిథాలి రాజ్ ను గుర్తుకు తెచ్చింది. మొదట్లో నిదానంగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత సింహం లాగా జూలు విదిల్చింది. బౌలర్ ఎవరనేది లెక్క పెట్టకుండా దూకుడుగా ఆడింది. తద్వారా తొలి వన్డే సెంచరీ చేసింది. హర్లీన్ ను కనుక మరింత సాన పెడితే ఆమె టీమిండియా కు మరో మిథాలీ రాజ్ అవుతుందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.