Homeక్రీడలుక్రికెట్‌India Women Vs Bangladesh Women: టీమిండియా ఇవాళ ఓడితే ఇక ఇంటికే.. టఫ్ మ్యాచ్.....

India Women Vs Bangladesh Women: టీమిండియా ఇవాళ ఓడితే ఇక ఇంటికే.. టఫ్ మ్యాచ్.. ఏం జరుగనుంది..

India Women Vs Bangladesh Women: టి20 వరల్డ్ కప్ లో భాగంగా దక్షిణాఫ్రికా తో గెలవాల్సిన మ్యాచ్లో టీమిండియా ఓడిపోయింది. దీంతో భారత మహిళల జట్టు మీద ఒత్తిడి నెలకొంది. ఈ క్రమంలో టీమిండియా అత్యంత కీలకమైన మ్యాచ్ నేడు ఆడబోతోంది. బంగ్లాదేశ్ జట్టుతో తలపడబోతోంది.

ఈ మ్యాచ్ కు టీమిండియాకు అత్యంత ముఖ్యం. ఎందుకంటే ఈ మ్యాచ్లో ఎలాగైనా భారీ అంతరంతో టీమిండియా గెలవాలి. అలా గెలిస్తే సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశాలుంటాయి. ఎందుకంటే బంగ్లాదేశ్ తర్వాత టీమిండియా ఆస్ట్రేలియాతో పోటీపడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మీద టీమిండియా గెలవాలంటే సర్వశక్తులు ఒడ్డాలి. టీమిండియా ప్లేయర్ల ఆట తీరు ప్రస్తుతం అంత గొప్పగా లేదు. బౌలింగ్ లో పేస్ విభాగం దారుణంగా ఉంది. స్పిన్ లో శ్రీ చరణి మాత్రమే సత్తా చూపిస్తోంది. స్మృతి మందాన, షెఫాలలి వర్మ మాత్రమే సూపర్ ఫామ్ లో ఉన్నారు. మిగతా బ్యాటర్లు అంతగా ఆకట్టుకోవడం లేదు. జమీమా తన స్థాయి ఇన్నింగ్స్ ఆడలేదు. కెప్టెన్ కౌర్ కూడా ఆకట్టుకోవడం లేదు. చివర్లో వస్తున్న రీచా మాత్రమే జోరు చూపిస్తోంది.

బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఈ మ్యాచ్లో టీమిండియా తన లోపాలను మొత్తం సవరించుకోవాలి. భారీ అంతరంతో గెలవాలి. అలా గెలిస్తేనే టీమిండియాకు నెట్ రన్ రేట్ మెరుగవుతుంది. ఒకవేళ తదుపరి మ్యాచ్లో ఆస్ట్రేలియాతో ఓడిపోయినప్పటికీ టీమ్ ఇండియాకు సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.

ఈ టోర్నీలో టీమిండియా బ్యాటర్లు నెదర్లాండ్ మీద మినహా.. మిగతా జట్ల మీద ఆశించిన స్థాయిలో బ్యాటింగ్ చేయలేకపోయారు.. బౌలర్లు కూడా ఆకట్టుకోలేకపోయారు. బంగ్లాదేశ్ జట్టుతో జరిగే మ్యాచ్ లో భారత ప్లేయర్లు భారీ ఇన్నింగ్స్ లు ఆడాల్సిన అవసరం ఉంది. బంగ్లాదేశ్ జట్టు ఈ సిరీస్ లో ఇప్పటివరకు పాకిస్తాన్ జట్టును ఓడించింది. అంతకుముందు నెదర్లాండ్స్ ను కూడా ఓడించింది. బంగ్లాదేశ్ ను అనామకచెట్టు అనుకుంటే టీం ఇండియాకు మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అందువల్లే కలిసికట్టుగా ఆడితేనే టీమ్ ఇండియాకు గెలుపు లభిస్తుంది. భారీ అంతరంతో విజయం సాధిస్తే సెమీఫైనల్ వెళ్లడానికి అవకాశం ఉంటుంది.. మాంచెస్టర్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version