Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan Chaturmasa Deeksha: *పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష ఏంటి? ఎందుకు చేస్తారో తెలుసా?*

Pawan Kalyan Chaturmasa Deeksha: *పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్ష ఏంటి? ఎందుకు చేస్తారో తెలుసా?*

Pawan Kalyan Chaturmasa Deeksha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దీక్ష బూనారు. చతుర్మాస దీక్ష తీసుకున్నారు. ఏటా జేష్ఠ మాసంలో దీక్షను చేపట్టే పవన్ కళ్యాణ్.. కార్తీక మాసంలో ఈ చతుర్మాస దీక్షను విరమిస్తారు. దీక్షాకాలంలో సాత్విక భోజనం తీసుకుంటారు. దేవతారాధన, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు. బుధవారం ఉదయం మంగళగిరిలోని శ్రీ పానకాల స్వామికి అర్చనలు చేయించిన అనంతరం దీక్ష చేపట్టారు పవన్ కళ్యాణ్. గురుముఖత స్వీకరించిన మంత్రోపదేశం ఆచరణ కోసం పవన్ కళ్యాణ్ ఈ దీక్షను క్రమం తప్పకుండా ఏటా చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది కూడా దీక్ష చేపట్టడం విశేషం. కార్తీక మాసం వరకు పవన్ కళ్యాణ్ చందన వర్ణ వస్త్రధారణతోనే కనిపిస్తారు.

* ఆధ్యాత్మిక భావాలు అధికం..
పవన్ కళ్యాణ్ లో ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ. అందుకే సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ అవసరం అని నొక్కి చెబుతూ వస్తున్నారు. నిత్యం ఆలయాలను సైతం సందర్శిస్తుంటారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం చతుర్మాస దీక్ష నేపథ్యంలో.. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన పాత ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

* కఠినమైన దీక్ష…
నాలుగు నెలల పాటు ఈ దీక్ష అత్యంత కఠినంగా ఉంటుంది. దీక్షాకాలంలో నియమితమైన జీవనం గడపనున్నారు పవన్ కళ్యాణ్. సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. వీధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రాలు ధరిస్తారు. నిత్యం అనుష్టానం, దేవతారాధన చేస్తూ.. సమయానుకూలంగా ధ్యానం, మంత్ర పారాయణం చేస్తారు. మరోవైపు పవన్ కళ్యాణ్ చతుర్మాస దీక్ష స్వీకరించిన నేపథ్యంలో.. గతంలోని పాత ఫోటోలను సోషల్ మీడియా ద్వారా జనసేన పంచుకుంది. తల్లి అంజనాదేవి, సోదరులు చిరంజీవి, నాగబాబు తో కలిసి ఉన్న ఫోటోలు ప్రత్యేక ఆకర్షణ గాని నిలుస్తున్నాయి.

* ఆలయాల సందర్శన..
దీక్ష చేపట్టిన పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు డిప్యూటీ సీఎంకు ధన్యవాదాలు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ లక్ష్మీనరసింహస్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పానకాల స్వామికి పట్టు వస్త్రాలతో పాటు పానకం నైవేద్యంగా పెట్టారు. కాకా ఈ దీక్ష నాలుగు నెలల పాటు కొనసాగనుంది. కార్తీక మాసంతో ఈ దీక్ష విరమిస్తారు.. ప్రస్తుతం దీక్షలో ఉండడంతో చందనవర్ణ వస్త్రాలతో ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు పవన్ కళ్యాణ్.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version