pakistan women vs india women : బంతితో తిప్పేశారు.. బ్యాట్ తో మెరిశారు.. పాక్ పని పట్టిన భారత్.. ఎంత తేడాతో గెలిచిందంటే..

బంతితో తిప్పేశారు.. బ్యాట్ తో మెరిశారు.. పాక్ పని పట్టిన భారత్.. ఎంత తేడాతో గెలిచిందంటే..

Written By: NARESH, Updated On : October 6, 2024 7:30 pm

ind vs pak w

Follow us on

pakistan women vs india women : వేదిక మాత్రమే మారింది. ఫార్మాట్ మాత్రమే చేంజ్ అయింది. ఫలితం మాత్రం అదే. పాక్ అంటే చాలు రెచ్చిపోయే టీమిండియా ప్లేయర్లు.. మళ్లీ అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. విజయం అత్యవసరమైన వేళ.. గెలిచి చూపించారు. సమష్టి ప్రదర్శనతో సెమీస్ ఆశలను సజీవంగా ఉంచారు.

టి20 మహిళా వరల్డ్ కప్ లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ జట్టుపై భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారీగా రన్ రేట్ పెంచుకోవలసిన తరుణంలో.. భారత్ గెలిచిన తీరు ఆకట్టుకున్నది. తొలి మ్యాచ్లో 58 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఓడిపోయిన భారత జట్టు..పాక్ పై జరిగిన మ్యాచ్లో మాత్రం అద్భుతమైన ప్రదర్శన చూపించింది.. మందకొడి మైదానంపై సూపర్బ్ ఆట తీరు ప్రదర్శించి ఔరా అనిపించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ ఫస్ట్ బ్యాటింగ్ చూజ్ చేసుకుంది. అయితే భారత బౌలర్లు రెచ్చిపోవడంతో పాకిస్తాన్ జట్టుకు ప్రారంభించి కష్టాలు తప్పలేదు. తొలి ఓవర్ చివరి బంతికే శ్రేయాంక పాటిల్ చేసిన అద్భుతమైన మందికి ఓపెనర్ గుల్ ఫిరోజా అవుట్ అయింది. అప్పటికి పాకిస్తాన్ జట్టు ఒక పరుగు మాత్రమే చేసింది. ఇక ఆ తర్వాత నుంచి పాకిస్తాన్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో అరుంధతి రెడ్డి 3, శ్రేయాంక రెండు వికెట్లు పడగొట్టారు. రేణుక సింగ్, దీప్తి శర్మ, ఆశా శోభన తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. దీంతో పాకిస్తాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 105 రన్స్ చేసింది. పాకిస్తాన్ జట్టులో నిదా(28), మునిబా(17), ఫాతిమా (13) టాప్ స్కోరర్లు గా నిలిచారు.

ప్రారంభంలో ఇబ్బంది

106 పరుగుల టార్గెట్ తో రంగంలోకి దిగిన భారత జట్టుకు అదిరిపోయే ఆరంభం లభించలేదు. సూపర్ ఫామ్ లో ఉన్న ఓపెనర్ స్మృతి మందాన (7) నిరాశపరిచింది. 16 బంతులు ఎదుర్కొని కేవలం ఏడు పరుగులు మాత్రమే చేసి సాదియా ఇక్బాల్ బౌలింగ్ లో అవుట్ అయింది. ఫలితంగా 18 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్(23), ఓపెన్ షఫాలి వర్మ (32) దీటుగా ఆడారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్ కు 43 పరుగులు జోడించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 61 పరుగుల వద్ద జెమిమా అవుట్ అయింది. ఆ తర్వాత కెప్టెన్ హర్మోన్ ప్రీత్ కౌర్(29) సత్తా చాటడంతో భారత్ పటిష్ట స్థితిలో నిలిచింది. ఇదే సమయంలో జట్టు స్కోరు 80 పరుగుల వద్దకు చేరుకున్నప్పుడు జెమిమా అవుట్ అయింది. ఆ విపరుల వద్ద రిచా ఘోష్(0) గోల్డెన్ డక్ గా వెను తిరిగింది. భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ రిటైర్డ్ హర్ట్ గా వెనదిరిగింది. ఆ తర్వాత దీప్తి శర్మ (7), సంజన (4) గెలుపు లాంచనం పూర్తి చేయడంతో.. భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. భారత్ 18.5 ఓవర్లలోనే విజయం సాధించడం విశేషం.