https://oktelugu.com/

Blind Cricket World Cup 2024: పాకిస్తాన్ కు మరో షాక్ ఇచ్చిన భారత్.. ఈసారి ఏం జరిగిందంటే?

వచ్చే పాకిస్తాన్ వేదికగా ఏడాది జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడేది లేదని భార ఇప్పటికే స్పష్టం చేసింది. చాంపియన్స్ ట్రోఫీ టూర్ ను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించకుండా అడ్డుకున్నది. ఇవి రెండు కాకుండా మరో షాక్ కూడా ఇచ్చింది. దీంతో పాకిస్తాన్ జట్టు కకావికలం అవుతోంది.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : November 20, 2024 / 10:25 AM IST

    Blind Cricket World Cup 2024

    Follow us on

    Blind Cricket World Cup 2024: పాకిస్తాన్ వేదికగా అంధుల టి20 ప్రపంచ కప్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్వహించనున్నారు. ఈ టోర్నీని పాకిస్తాన్ వేదికగా నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత్ నిరసన వ్యక్తం చేసింది. పాకిస్తాన్ వేదికగా ఈ టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో భారత జట్టు దాయాది దేశంలో ఆడేందుకు భారత విదేశాంగ శాఖ ఒప్పుకోలేదు. ఈ మేరకు అనుమతిని నిరాకరిస్తూ తన నిర్ణయాన్ని వెల్లడించింది.. పాకిస్తాన్ దేశంలో నిర్వహిస్తున్న టోర్నీలో ఆడేందుకు భారత అంధ క్రికెట్ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి నిరభ్యంతర పత్రం ముందుగానే వచ్చింది. అయితే భారతదేశం అక్కడికి పంపేందుకు విదేశాంగ శాఖ ఒప్పుకోలేదు.. ఫలితంగా భారత జట్టు ఆడకుండానే టి20 వరల్డ్ కప్ టోర్నీ పాకిస్తాన్ వేదికగా జరుగుతుంది..” భారత జట్టు పాకిస్తాన్ వెళ్లడానికి క్రీడా మంత్రిత్వ శాఖ ముందుగానే నిరభ్యంతర పత్రాన్ని అందించింది. అయితే దీనిని విదేశాంగ శాఖ ఖండించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మన జట్టు ఆటగాళ్లు పాకిస్తాన్లో పర్యటించకూడదని స్పష్టం చేసింది. దాయాది దేశంలో జట్టు ఆడకూడదని వెల్లడించింది. దీంతో మన జట్టు లేకుండానే ఈసారి టి20 వరల్డ్ కప్ జరుగుతుందని” భారత్ అంధుల క్రికెట్ సంఘం ప్రధాన కార్యదర్శి శైలేంద్ర యాదవ్ పేర్కొన్నారు.

    ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ..

    వచ్చేఏడాది పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. ఈ ట్రోఫీ నిర్వహణ కోసం పాకిస్తాన్ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. మైదానాలను ఆధునికీకరిస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా తాము పాక్ లో పర్యటించబోమని భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ఐసీసీకి తేల్చి చెప్పింది. అంతేకాదు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో నిర్వహించే ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ కూడా రద్దు చేయాలని ఒత్తిడి తీసుకురావడంతో.. ఐసీసీ ఇదే విషయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు స్పష్టం చేసింది. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ టూర్ రద్దయింది. అయితే చాంపియన్స్ ట్రోఫీ లో తాము ఆడాలంటే కచ్చితంగా హైబ్రిడ్ మోడ్ లో పోటీలు నిర్వహించాలని భారత్ కోరుతోంది. పాకిస్తాన్ దేశంలో ఇటీవల నిర్వహించిన ఆసియా కప్ లోనూ ఇదే విధానాన్ని అనుసరించారని.. ఇప్పుడు త్వరలో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీ లోనూ అదే పద్ధతిని పాటించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి కోరుతోంది. అంతేకాదు తమ జట్టు ఆడే మ్యాచ్ లు దుబాయ్ వేదికగా నిర్వహించాలని సూచిస్తున్నది. అయితే భారత్ వ్యక్తం చేస్తున్న డిమాండ్లను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఒప్పుకోవడం లేదు.. భారత ఆటగాళ్లకు భద్రత కల్పిస్తామని చెబుతోంది. అయితే ఈ మాటలను భారత క్రికెట్ నియంత్రణ మండలి ఒప్పుకోవడం లేదు. ఇవి ఇలా జరుగుతుండగానే పాకిస్తాన్ వేదికగా జరుగుతున్న అంధుల ప్రపంచ కప్ నుంచి భారత్ ఎగ్జిట్ అవ్వడం చర్చకు దారి తీస్తోంది.. అయితే ఈ నిర్ణయాన్ని నెటిజన్లు స్వాగతిస్తున్నారు. భారత అంధుల క్రికెట్ జట్టు మంచి నిర్ణయం తీసుకుందని కొనియాడుతున్నారు.