https://oktelugu.com/

Visakhapatnam : వీడియోలు తీసి.. బ్లాక్ మెయిల్ చేసి.. విశాఖలో లా స్టూడెంట్ పై నలుగురు చేసిన దారుణం ఇదీ

ఏపీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖలో ఓ న్యాయ విద్యార్థినిపై గ్యాంగ్ రేప్ జరిగింది. ప్రియుడితో సన్నిహితంగా ఉన్న ఫోటోలను తీసి బ్లాక్ మెయిల్ చేసి ముగ్గురు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడంతో విషయం బయటపడింది.

Written By:
  • Dharma
  • , Updated On : November 20, 2024 / 10:33 AM IST
    Law student

    Law student

    Follow us on

    Visakhapatnam :  మహిళల రక్షణకు సంబంధించి ఎన్ని రకాల చట్టాలు తీసుకువచ్చినా నేరాలు మాత్రం అదుపులోకి రావడం లేదు. మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడడం లేదు. నిత్యం ఏదో ఒక చోట ఇటువంటి ఘటనలు బయటపడుతూనే ఉన్నాయి. ధైర్యం చేసి కొందరు మాత్రమే పోలీసులను ఆశ్రయిస్తున్నారు. మరికొందరు పరువు కోసం పాకులాడి లోలోపల మధనపడుతున్నారు. ఏపీలో మరో దారుణం వెలుగు చూసింది. ఓలా స్టూడెంట్ మీద సామూహిక అత్యాచారం జరిగింది. విశాఖలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులు బ్లాక్మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో తీసి బెదిరింపులకు దిగడంతో ఏం చేయాలో తెలియక బాధితురాలు ఆత్మహత్యకు ప్రయత్నించింది. స్థానికంగా ఓ లా కాలేజీలో బి ఎల్ చేస్తోంది ఓ యువతి. సహస్ర విద్యార్థితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. పెళ్లి చేసుకుంటానని ఆమెను నమ్మించిన యువకుడు శారీరకంగా ఆమెతో కలిశాడు.

    * ప్రేమ పేరుతో
    ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు తీసుకువెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా అదే నెలలో తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లి బాధితురాలిపై మరోసారి అత్యాచారం చేశాడు. అటు తరువాత అతని స్నేహితులు ముగ్గురు కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిని వీడియో తీసిన నిందితులు బెదిరిస్తూ ఆమెను పలుమార్లు అత్యాచారం చేశారు. అయితే రోజురోజుకు ఈ వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు భరించలేకపోయింది. ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించడంతో ప్రాణాలతో బయటపడింది. గట్టిగా వారు అడిగేసరికి అసలు విషయం బయట పెట్టింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆ నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

    * హోం మంత్రి ఆరా
    విశాఖలో జరిగిన ఈ ఘటనపై ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. విశాఖ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.