IND vs NZ : న్యూజిలాండ్ లో ‘సూర్య’ ప్రతాపం: హార్ధిక్ కెప్టెన్సీ అద్భుతం.. రెండో టీ20 లో టీమిండియా ఘనవిజయం

IND vs NZ : తుఫాను.. మెరుపు.. ఊచకోత.. విధ్వంసం.. సుడిగాలి.. ఇంకా ఏవైనా ఉపమానాలు మిగిలి ఉంటే అవి కూడా.. అలా సాగింది మరి సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ అయ్యేదాకా వన్డే తరహా ఆట ఆడుతున్న సూర్య.. తర్వాత మే నెలలో సూర్యుని మాదిరి రెచ్చిపోయాడు. శీతల దేశమైన న్యూజిలాండ్లో సెగలు కక్కించాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 111 పరుగులు చేసి నాట్ అవుట్ గా […]

Written By: NARESH, Updated On : November 20, 2022 4:55 pm
Follow us on

IND vs NZ : తుఫాను.. మెరుపు.. ఊచకోత.. విధ్వంసం.. సుడిగాలి.. ఇంకా ఏవైనా ఉపమానాలు మిగిలి ఉంటే అవి కూడా.. అలా సాగింది మరి సూర్య కుమార్ యాదవ్ ఇన్నింగ్స్.. హాఫ్ సెంచరీ అయ్యేదాకా వన్డే తరహా ఆట ఆడుతున్న సూర్య.. తర్వాత మే నెలలో సూర్యుని మాదిరి రెచ్చిపోయాడు. శీతల దేశమైన న్యూజిలాండ్లో సెగలు కక్కించాడు. 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్ల సహాయంతో 111 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. కెరీర్లో రెండవ టి20 సెంచరీ పూర్తి చేశాడు. అతగాడి బ్యాటింగ్ తీరుకు టీమిండియా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది.

-తేలిపోయారు

ఆస్ట్రేలియా లో ఇంగ్లాండ్ జట్టుతో సెమీస్ ఓటమి అనంతరం జట్టులో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సీనియర్లను విశ్రాంతి పేరుతో పక్కన పెట్టారు. హార్దిక్ పాండ్యా కు కెప్టెన్సీ అవకాశమిచ్చారు. రిషబ్ పంత్ ను వైస్ కెప్టెన్ గా నియమించారు. ఓపెన్ గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ ఆరు పరుగులు మాత్రమే చేసి క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఈ దశలో వన్ డౌన్ లో వచ్చిన సూర్య హాఫ్ సెంచరీ అయ్యే దాకా నింపాదిగా ఆడాడు. ఇషాన్ కిషన్ తో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. కానీ వ్యక్తిగత స్కోర్ 36 వద్ద ఉన్నప్పుడు కిషన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ ఎవరూ కూడా అంతగా ఆకట్టుకోలేదు. హుడా, సుందర్ డక్ ఔట్ అయ్యారు. పాండ్యా, సుందర్ 13 పరుగులు చేసి ఔట్ అయ్యారు. సూర్య గనుక విజృంభించి ఆడకపోయి ఉంటే ఇండియా వంద లోపే ఆల్ అవుట్ అయ్యేది. టీం స్కోర్ 191.. అందులో సూర్య స్కోర్ 111 అందరూ ఒక ఎత్తు అయితే తాను ఒక్కడే ఒకే ఒక్కడు అని సాటి చెప్పే ఇన్నింగ్స్ ఆడాడు.. కివీస్ ఎక్స్ ట్రా ల రూపంలో 11 పరుగులు ఇవ్వడం గమనార్హం.

-దీపక్ హుడా ధాటికి బెంబేలు

తిరిగి బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ పరుగులు ఏమీ చేయకుండానే ఓపెనర్ అలెన్ వికెట్ కోల్పోయింది. ఇక అప్పటి నుంచి కివీస్ దీపక్ హుడా ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ విలియమ్సన్ తప్ప ఎవరూ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. పిచ్ పై ఉన్న తేమను ఉపయోగించుకుంటూ సిరాజ్, చాహాల్ చెరో రెండు వికెట్లు తీశారు. భువి, సుందర్ చెరో వికెట్ తీశారు. మొత్తానికి 18.5 ఓవర్లలో కివీస్ ను 126 పరుగుల కు కట్టడి చేయడం ద్వారా ఇండియా 65 పరుగుల తో విజయం సాధించింది. సూర్య కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

-హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ సూపర్.. పంత్ ఫెయిల్..
ఇక ఈ మ్యాచ్ లో హార్ధిక్ పాండ్యా కెప్టెన్సీ సూపర్ గా ఉంది. రిషబ్ పంత్ మరోసారి ఫెయిల్ అయ్యాడు. 13 బంతుల్లో కేవలం 6 పరుగులే మాత్రమే చేశాడు. మరీ జిడ్డుగా ఆడాడు. ఇక ఇషాన్ కిషన్ 36 పరుగులతో రాణించాడు. సూర్య తర్వాత కొట్టింది ఇషాన్ కిషనే.. ఇక సూర్య కూడా 10 ఓవర్ల దాకా 50 పరుగులతో నెట్టుకొచ్చాడు. హాఫ్ సెంచరీ తర్వాత గేర్ మార్చి భారత్ భారీ స్కోరుకు బాటలు వేశాడు. ఇక 18 ఓవర్ చివర్లో స్పిన్నర్ ఆల్ రౌండర్ అయిన దీపక్ హుడాకు బౌలింగ్ ఇవ్వడం మ్యాచ్ లో మలుపుగా చెప్పవచ్చు. ఆ ఓవర్లలో ఏకంగా 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఇదే హుడాను ఉపయోగించుకోలేక రోహిత్ వరల్డ్ కప్ లో విఫలమైతే.. న్యూజిలాండ్ లో ఉపయోగించుకొని హిట్ అయ్యాడు. సో ఉన్న వనరులను ఉపయోగించుకోవడంలో మరోసారి హార్ధిక్ తన కెప్టెన్సీ పవర్ చూపించాడు. భావి కెప్టెన్ గా హార్ధిక్ మరోసారి నిరూపించుకున్నాడనే చెప్పాలి.