India vs West Indies Highlights: రెండుసార్లు వన్డే వరల్డ్ కప్ సాధించింది. టి20 వరల్డ్ కప్ కూడా రెండుసార్లు అందుకుంది.. భయంకరమైన ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. అద్భుతమైన ప్రతిభ చూపించే సామర్థ్యం వారి సొంతం. అటువంటి ప్లేయర్లు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నారు. వెస్టిండీస్ జట్టు పతనాన్ని చూస్తూ ఆవేదన చెందుతున్నారు. ఆటగాళ్లలో సామర్థ్యం ఉన్నప్పటికీ సరిగ్గా ఆడటం లేదు. జట్టులోకి కొత్త రక్తం వస్తున్నా.. అది జట్టు సేవలను తీర్చలేక పోతోంది. దీంతో ప్రపంచ క్రికెట్ ను ఒకప్పుడు శాసించిన వెస్టిండీస్.. ఇప్పుడు పూర్తిగా ఢీలా పడిపోయింది.
టీమిండియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ను వెస్టిండీస్ ఓటమితో మొదలుపెట్టింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ లో ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఓటమిపాలైంది. వెస్టిండీస్ ఓటమి ఆశ్చర్యాన్ని కలిగించకపోయినప్పటికీ.. ఇలా ఇన్నింగ్స్ తేడాతో ఓటమి ఆ జట్టు అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది. 2013 నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు టీం ఇండియాతో వెస్టిండీస్ జట్టు తలపడిన టెస్టు సిరీస్లలో ఓటములే ఎదురవుతున్నాయి. ఇన్నింగ్స్ తేడాతో ఓటములు ఎదుర్కొంటూ వెస్టిండీస్ జట్టు పరువు తీసుకుంటున్నది.
దారుణమైన ఓటములు
2013లో కోల్ కతా వేదికగా టీమిండియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ ఇన్నింగ్స్ 51 పరుగుల తేడాతో ఓడిపోయింది.
2013లో ముంబై వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో ఇన్నింగ్స్ 126 పరుగుల తేడాతో వెస్టిండీస్ టీం ఇండియా చేతిలో ఓడిపోయింది.
2018లో రాజ్ కోట్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో 272 పరుగుల తేడాతో టీమిండియాపై వెస్టిండీస్ జట్టు ఓటమిపాలైంది.
2018లో హైదరాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో వెస్టిండీస్ పది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.
ఇక ప్రస్తుత సీజన్లో అహ్మదాబాద్ వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో టీమిండియా ఇన్నింగ్స్ 140 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. టీమిండియా సాధించిన విజయంలో కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జూరెల్, సిరాజ్, కులదీప్ యాదవ్ కీలకపాత్రలు పోషించారు.