https://oktelugu.com/

Director Maruthi: షూటింగ్ సమయంలో స్టార్ హీరోను కూడా లెక్క చేసేది కాదు…స్టార్ హీరోయిన్ గురించి సంచలన కామెంట్స్ చేసిన ప్రభాస్ దర్శకుడు…

మారుతి న్యాచురల్ స్టార్ నాని,లావణ్య త్రిపాఠి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాకు దర్శకత్వం వహించి మరోక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాతో నాని క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు.ఆ తర్వాత మారుతి తెలుగులో బాబు బంగారం,మహానుభావుడు,శైలజ రెడ్డి అల్లుడు,ప్రతి రోజు పండగే,మంచి రోజులు వచ్చాయి,పక్క కమర్షియల్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.తాజాగా దర్శకుడు మారుతి ఒక ఇంటర్వ్యూ లో ఒక స్టార్ హీరోయిన్ గురించి సంచలన కామెంట్స్ చేసారు.

Written By:
  • Srinivas
  • , Updated On : July 9, 2024 / 08:22 AM IST

    Director Maruthi

    Follow us on

    Director Maruthi: ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న స్టార్ దర్శకులలో మారుతి కూడా ఒకరు.ఈ రోజుల్లో అనే సినిమాతో మారుతి బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు.యూత్ ను ఆకట్టుకునే కథలను తెరకెక్కించి మంచి విజయాలను అందుకున్నాడు ఈ టాలెంటెడ్ దర్శకుడు.ఈ రోజుల్లో సినిమా సూపర్ హిట్ అయ్యి థియేటర్లలో వంద రోజులు ప్రేక్షకులను అలరించింది.ఈ రోజుల్లో సినిమా విజయం తర్వాత బస్ స్టాప్,ప్రేమ కథ వంటి వరుస సినిమాలతో హ్యాట్రిక్ విజయం అందుకున్నాడు.దాంతో మారుతి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా మారిపోయాడు.

    ఆ తర్వాత మారుతి న్యాచురల్ స్టార్ నాని,లావణ్య త్రిపాఠి జంటగా నటించిన భలే భలే మగాడివోయ్ సినిమాకు దర్శకత్వం వహించి మరోక బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సినిమాతో నాని క్రేజ్ కూడా బాగా పెరిగిపోయింది అని చెప్పడంలో సందేహం లేదు.ఆ తర్వాత మారుతి తెలుగులో బాబు బంగారం,మహానుభావుడు,శైలజ రెడ్డి అల్లుడు,ప్రతి రోజు పండగే,మంచి రోజులు వచ్చాయి,పక్క కమర్షియల్ వంటి సినిమాలను తెరకెక్కించాడు.తాజాగా దర్శకుడు మారుతి ఒక ఇంటర్వ్యూ లో ఒక స్టార్ హీరోయిన్ గురించి సంచలన కామెంట్స్ చేసారు.మారుతి ఆ స్టార్ హీరోయిన్ తో వాదానికి దిగిన విషయాన్నీ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.ఆమె మరెవరో కాదు జవాన్ సినిమాతో హిట్ అందుకున్న బ్యూటీ లేడీ సూపర్ స్టార్ నయన తార .

    నయనతార మారుతి దర్శకత్వం లో బాబు బంగారం సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.వెంకటేష్ హీరోగా చేసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.ఈ సినిమా షూటింగ్ సమయంలో మారుతీకి,నయన్ కు మధ్య జరిగిన వాగ్వాదం గురించి చెప్పుకొచ్చాడు దర్శకుడు మారుతి.బాబు బంగారం సినిమా షూటింగ్ సమయంలో నయన్ సినిమా యూనిట్ కు అస్సలు సహకరించేది కాదని…నేను ఆ సమయంలో పెద్ద దర్శకుడిని కాదు..నన్ను గౌరవించకపోయిన పర్లేదు..కానీ వెంకటేష్ వంటి సీనియర్ హీరోను కూడా నయన్ లెక్క చేసేది కాదు అంటూ చెప్పుకొచ్చాడు.ఎంతో ఓపికగా భరించిన నేను ఒకసారి నయన్ తో గొడవకు దిగాను అని తెలిపారు.నయన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయింది.

    అయితే ఒక సాంగ్ బాలన్స్ ఉండటంతో షూటింగ్ రమ్మనీ అడిగితే వేరే సినిమాలతో బిజీ గా ఉన్నాను..డేట్స్ ఖాళీ లేవు అని చెప్పింది.దాంతో ఒక సాంగ్ లేకుండానే బాబు బంగారం సినిమాను రిలీజ్ చేసాము అంటూ మారుతి చెప్పుకొచ్చాడు.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మారుతి రెబెల్ స్టార్ ప్రభాస్ తో ది రాజా సాబ్ అనే టైటిల్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.ది రాజా సాబ్ సినిమా నుంచి ఇప్పటికే ప్రభాస్ లుక్ ను కూడా చిత్ర యూనిట్ రిలీజ్ చేయడం జరిగింది.ఈ సినిమా సూపర్ హిట్ అయితే మారుతి క్రేజ్ ఓ రేంజ్ లో పెరిగిపోతుంది అనడంలో సందేహం లేదు.అయితే ప్రభాస్ ఇప్పటికే సలార్,కల్కి వంటి సినిమాలతో సెన్సేషనల్ హిట్స్ అందుకున్నారు.ఇక రాజా సాబ్ సినిమాతో ప్రభాస్ ఎలాంటి విజయం అందుకుంటారో వేచి చూడాల్సిందే.