India Vs South Africa Series: 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇండియా ఓడిపోవడంతో ప్రస్తుతం ఇండియన్ టీం కెప్టెన్ గా ఎవరు వ్యవహరిస్తారు అలాగే టీమ్ ని ఎవరు ముందుకు తీసుకెళ్తారు అనే విషయం మీద అందరిలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా మీద ఆడుతున్న టి20 సిరీస్ కి సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడు జరగబోయే సౌతాఫ్రికా సీరీస్ కోసం ఎవర్ని టీం లోకి కెప్టెన్ గా తీసుకోవాలి అనే దానిపైన బీసీసీఐ రకరకాల చర్చలను జరిపి మొత్తానికి మూడు ఫార్మాట్లకు ముగ్గురు కెప్టెన్లను సెలెక్ట్ చేసింది. అందులో భాగంగానే టెస్టు సిరీస్ లో రోహిత్ శర్మ కెప్టెన్ కి వ్యవహరించగా, వన్డేల్లో కేఎల్ రాహుల్, టి20 లో సూర్య కుమార్ యాదవ్ ని కెప్టెన్లుగా నియమించాలని బీసీసీఐ నిర్ణయించుకుంది…ఇక అందులో భాగంగానే ఈ మూడు ఫార్మాట్లకు మూడు టీం లను కూడా ప్రకటించింది. ఒకసారి మూడు ఫార్మాట్ లలో ఉన్న టీమ్ మెంబర్స్ ని కనక చుసుకున్నటైతే…
టి 20 ల్లో
యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్,ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా (వైస్ కెప్టెన్), వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, సిరాజ్, ముకేశ్ కుమార్, దీపక్ చాహర్, కుల్‌దీప్ యాదవ్ లాంటి ప్లేయర్ల ను సెలెక్ట్ చేశారు.ఇక ఈ టీమ్ లో అందరూ యంగ్ ప్లేయర్లు ఉండటం విశేషం…ఇక బిసిసిఐ కూడా 2024 లో జరిగే టి 20 వరల్డ్ కప్ ని దృష్టి లో పెట్టుకొని టీమ్ ని సెలెక్ట్ చేస్తుంది.అందుకే బిసిసిఐ ప్లేయర్లందరిని టెస్ట్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…
ఇక వన్డేలకు కూడా ఇండియన్ టీమ్ కొత్త కెప్టెన్ ని తీసుకోవడం అనేది ఇప్పుడు చర్చ నియాంశం గా మారింది.రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మ, రజత్ పటీదార్, రింకు సింగ్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహల్ (కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్‌దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, ముకేశ్ కుమార్, అవేశ్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, దీపక్ చాహర్ లాంటి ప్లేయర్లతో ఈ టీమ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఇక మొత్తానికి సంజు శాంసన్ కి మళ్ళీ టీమ్ లో చోటు కల్పించడం అనేది మంచి విషయం అనే చెప్పాలి…
ఇక టెస్టులకు రోహిత్ శర్మ కెప్టెన్ గా తీసుకోవడం శుభ్ మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, సిరాజ్, షమీ, బుమ్రా (వైస్ కెప్టెన్), ప్రసిధ్ కృష్ణ లాంటి ప్లేయర్ల తో సౌతాఫ్రికా మీద ఇండియన్ టీమ్ కప్పు కొట్టడానికి రెడీ అవుతుంది…
డిసెంబర్ 10వ తేదీన తొలి టీ20 మ్యాచ్ తో సౌతాఫ్రికా తో సీరీస్ లు స్టార్ట్ అవుతున్నాయి ఇక ఇలా వరుసగా టి 20, వన్డే, టెస్ట్ సీరీస్ లు ఆడాల్సి ఉంది.ఇక ఇందులో ఇండియన్ టీమ్ తన సత్తా చూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది…