క్రీడలుUnder 19 World Cup: సెమీస్ లో ఓడిపోయే స్థితి నుంచి వీరోచితంగా...

Under 19 World Cup: సెమీస్ లో ఓడిపోయే స్థితి నుంచి వీరోచితంగా టీమిండియా గెలిపించిన ఆ ఇద్దరు…

Under 19 World Cup: అండర్ 19 వరల్డ్ కప్ లో ఇండియన్ టీమ్ దుమ్ము రేపుతుంది. ఇక సౌతాఫ్రికా తో ఆడిన మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా గ్రాండ్ గా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఉదయ్ సహరన్ 81 పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడడంతో ఇండియా చాలా ఈజీగా ఈ మ్యాచ్ ని గెలవగలిగింది. అలాగే సచిన్ దాస్ 96 పరుగులు చేసి మన టీమ్ గెలుపు లో ముఖ్య పాత్ర పోషించాడు.

ఇక ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా టీమ్ నిర్ణీత 50 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. ఇక 245 పరుగుల లక్ష్యం తో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ ప్లేయర్లు మొదట్లో కొంతవరకు తడబడ్డప్పటికీ సహరన్, సచిన్ దాస్ ఇద్దరు భారీ ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా టీమ్ ను దగ్గరుండి మరి విజయ తీరాలకు చేర్చారనే చెప్పాలి. ముఖ్యంగా వీళ్లిద్దరు ఆడిన ఆటను చూస్తే సౌతాఫ్రికన్ ప్లేయర్లు చెమటలు పట్టాయి.

వీళ్ళ వికెట్లు తీయడం వాళ్లకు చాలా కష్టమైంది. దాంతో ఇండియన్ టీమ్ 48.5 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయి 248 పరుగులు చేసి గ్రాండ్ విక్టరీ కొట్టింది. దాంతో పాటు గా ఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇదిలా ఉంటే ఈ నెల 8వ తేదీన రెండోవ సెమీఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్తాన్ టీమ్ లు తలబడనున్నాయి. ఇక ఈ రెండింటిలో ఏ టీం అయితే విజయం సాధిస్తుందో ఆ టీమ్ ఈనెల 11వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ లో ఇండియాతో తలబడనుంది.

ఇక ఏ టీమ్ పరిస్థితి ఎలా ఉన్నా కూడా ఇండియన్ టీమ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా టాప్ గేర్ లో దూసుకుపోతుందనే చెప్పాలి. ఇక గత సంవత్సరం ఇంటర్నేషనల్ వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్ కి వచ్చి ఓడిపోయిన ఇండియన్ టీమ్ కప్పు కొట్టలేక పోయింది. కాబట్టి అండర్ 19 లో అయిన భారీ విజయం సాధించి ఇండియా కప్పు కొట్టి మన దేశ పరువుని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి అని యావత్ దేశ ప్రజలు అందరూ కోరుకుంటున్నారు. ఇక ఇండియన్ టీం ఫైనల్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

India U19 vs Afghanistan U19 : భారత్ కు షాక్ ఇచ్చిన ఆఫ్ఘనిస్తాన్..

India U19 vs Afghanistan U19 : అండర్ 19 వరల్డ్ కప్ లో భారత్ పాకిస్తాన్ జట్టును ఓడించి సెమి ఫైనల్ వెళ్ళింది. సెమీఫైనల్ లో ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో తలపడుతోంది. బుధవారం...

Vaibhav Suryavanshi : పాకిస్తాన్ క్రికెటర్ ను కొట్టబోయిన వైభవ్ సూర్య వంశీ.. వైరల్ వీడియో

Vaibhav Suryavanshi : యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడు తన ఏంటో అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. తన దూకుడును ఇంకా కొనసాగిస్తూనే...

Most Popular

FIFA World Cup 2026: వాటర్ బాటిల్ 500.. చికెన్ ఫ్రై 1800.. ఈ రేట్ల వెనుక ఉన్న...

FIFA World Cup 2026: మనం ఒక వాటర్ బాటిల్ కొనుగోలు చేస్తే ఎంత ఖర్చు పెడతాం.. మహా అయితే 20.. ఇంకాస్త ప్రీమియం అనుకుంటే 30.. ఇంకా బాగా ప్రీమియం అనుకుంటే...

Trump FIFA Club World Cup: నీ ప్రచార పిచ్చి తగలెయ్య.. ఫిఫా కప్ లో అమెరికా అధ్యక్షుడు...

Trump FIFA Club World Cup: ప్రజా జీవితంలో ఉన్న వాళ్లకు ప్రచారం కచ్చితంగా కావాలి. వాళ్లు చేసే చిన్న పని అయినా సరే.. అందరికీ తెలియాలి. అందువల్లే నేటి కాలంలో...

Rohit Sharma: రిటైర్మెంట్ పై తొలిసారి నోరు విప్పిన రోహిత్.. క్లారిటీ ఇచ్చేశాడుగా..

Rohit Sharma: "అతడి వయసు 40 కి దగ్గరగా వచ్చింది. అంతగా ఆడలేడు. ఐపీఎల్ లో సత్తా చూపించలేకపోయాడు. వికెట్ల మధ్య వేగంగా పరుగులు పెట్టలేకపోతున్నాడు. అతడు రిటైర్మెంట్ తీసుకునే సమయం వచ్చింది....

Skyroot Aerospace: స్కై రూట్ మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉన్నాయి.. భవిష్యత్తు మొత్తం వీటిదే..

Skyroot Aerospace: స్కై రూట్ అంతరిక్ష పరిశోధన లో సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. తక్కువ, మధ్య స్థాయి బరువున్న ఉపగ్రహాలను ప్రత్యేకమైన రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి పంపించి అద్భుతం సృష్టించింది. ప్రైవేట్ రంగంలో...

Lamine Yamal : 19 ఏళ్ల వయసులో గర్ల్ ఫ్రెండ్.. ఆమెకు ఏకంగా బెంజ్ కారు.. ఈ ఫుట్...

Lamine Yamal : అతడి వయసు జస్ట్ 19 సంవత్సరాలు మాత్రమే. కానీ అతడు ఫుట్బాల్ ను మొత్తం దున్నేస్తున్నాడు. ప్రత్యర్థులకు అంతుచిక్కని స్థాయిలో ఆడుతున్నాడు. ఈ సీజన్లో స్పెయిన్ జట్టు విజేతగా...
Exit mobile version