Homeక్రీడలుక్రికెట్‌Vaibhav Suryavanshi : పాకిస్తాన్ క్రికెటర్ ను కొట్టబోయిన వైభవ్ సూర్య వంశీ.. వైరల్ వీడియో

Vaibhav Suryavanshi : పాకిస్తాన్ క్రికెటర్ ను కొట్టబోయిన వైభవ్ సూర్య వంశీ.. వైరల్ వీడియో

Vaibhav Suryavanshi : యంగ్ ప్లేయర్ వైభవ్ సూర్య వంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అతడు తన ఏంటో అనేక సందర్భాల్లో నిరూపించుకున్నాడు. తన దూకుడును ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు నిండా 18 సంవత్సరాలు లేకపోయినప్పటికీ.. అతడు పరుగులు తీసే విషయంలో ఏ మాత్రం రాజీ పడటం లేదు. ఐపీఎల్ లో శతకం సాధించిన వైభవ్ సూర్య వంశీ.. అండర్ 19 లో కూడా అదే జోరుకొనసాగిస్తున్నాడు. తన ఆట యాక్సిడెంటల్ కాదని.. ఇన్సి డెంటల్ అని నిరూపిస్తున్నాడు.
వైభవ్ సూర్య వంశీ ప్రస్తుతం జరుగుతున్న అండర్ 19 వరల్డ్ కప్ లో దుమ్ము రేపు తున్నాడు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా జోరు చూపిస్తున్నాడు. పాకిస్తాన్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో వైభవ్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించాడు. పాకిస్తాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అయితే అతడు గనుక ఇంకా సుదీర్ఘమైన ఇన్నింగ్స్ ఆడి ఉంటే భారత జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది.
నిన్నటి మ్యాచ్లో పాకిస్తాన్ ఇన్నింగ్స్ సాగుతున్న సమయంలో వైభవ్ సూర్య వంశీ రెచ్చిపోయాడు. పాకిస్తాన్ ప్లేయర్ల మీదికి దూసుకుపోయాడు. అతడిని తోటి ప్లేయర్లు నిలువరించారు. లేకుంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.  పాకిస్తాన్ ఇన్నింగ్స్ 37వ ఓవర్లో ఆలీ బలోచ్ అవుట్ అయ్యాడు. ఈ సమయంలో వైభవ్ సూర్య వంశీ మీదికి దూసుకుపోయాడు. తోటి ప్లేయర్లు ఆపడంతో వైభవ్ సూర్య వంశీ ఆగిపోయాడు. ఒకవేళ అతడిని గనుక ఆపకపై ఉంటే.. అలీ కి “గట్టి మర్యాద” చేసేవాడు.
వైభవ్ సూర్య వంశీ పాకిస్తాన్ ప్లేయర్ మీదికి దూసుకుపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది.. ఔట్ అయి వెళ్తున్న పాకిస్తాన్ ప్లేయర్ మీదికి వైభవ్ వెళ్ళిపోతుండగా తోటి ప్లేయర్లు గుర్తించారు. వెంటనే అతడిని శాంతింపజేశారు. ఇక ఈ మ్యాచ్లో టీమ్ ఇండియా గెలిచినప్పటికీ.. పాకిస్తాన్ ప్లేయర్లతో షేక్ హ్యాండ్ తీసుకోవడానికి ఇష్టపడలేదు.
Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version