Homeక్రీడలుక్రికెట్‌India Vs Pakistan T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. విరాట్ ముందు దిగదుడుపే...

India Vs Pakistan T20 World Cup: భారత్, పాకిస్తాన్ మ్యాచ్.. విరాట్ ముందు దిగదుడుపే .. ఎందుకంటే?

India Vs Pakistan T20 World Cup: క్రికెట్లో భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే పోరాటానికి విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ప్రస్తుత టి20 వరల్డ్ కప్ లో టీమిండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అనేక రికార్డులను బద్దలు కొట్టింది. ప్రకటనల పరంగా బ్రాడ్ కాస్టింగ్ సంస్థలకు వందల కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. రాజకీయంగా కూడా రెండు జట్ల మధ్య మ్యాచ్ తీవ్రమైన చర్చకు దారితీసింది.

భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ఇటీవల జరిగిన మ్యాచ్లో పోటీ హోరాహోరీగా ఉంటుందని అందరు అనుకున్నారు. అయితే భారత జట్టు ఏకపక్షంగా విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలింగ్ పై ముందుగా ఎదురుదాడి చేసింది. ఆ తర్వాత బంతితో కూడా పాకిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్ మొత్తాన్ని కకావికలం చేసింది. ఫలితంగా అద్భుతమైన విజయాన్ని నమోదు చేసింది. దీంతో మరో మ్యాచ్ మిగిలి ఉండగా సూపర్ 8 దశకు చేరుకుంది.

సాధారణంగా భారత్, పాకిస్తాన్ మ్యాచ్ అంటే సరికొత్త రికార్డులు నమోదు అవుతూ ఉంటాయి. వీక్షణలపరంగా అనేక ఘనతలు చోటుచేసుకుంటాయి. తాజాగా జరిగిన మ్యాచ్ ను 44,00,00,000 మంది వీక్షించారు. ఈ గణాంకాలను జియో హాట్ స్టార్ అధికారికంగా ప్రకటించింది. భారత్, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ భారీగా వ్యూస్ నమోదు చేసినప్పటికీ.. అది విరాట్ కోహ్లీ కి దరిదాపుల్లో లేదు.

ఐపీఎల్ లో గత ఏడాది ఫైనల్ మ్యాచ్లో పంజాబ్, బెంగళూరు పోటీ పడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు 67,00,00,000 వ్యూస్ లభించాయి. బెంగళూరులో విరాట్ కోహ్లీ ఉన్నాడు కాబట్టి.. ఫైనల్ మ్యాచ్లో అతడు అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు కాబట్టి.. ఆ స్థాయిలో వ్యూస్ నమోదయ్యాయి.

విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు 2008 నుంచి ఆడుతున్నాడు. 2024 వరకు అనేక సందర్భాలలో బెంగళూరు ఫైనల్ వెళ్లినప్పటికీ ఐపీఎల్ ట్రోఫీ అందుకోలేకపోయింది. 2025లో మాత్రం చరిత్రను బెంగళూరు జట్టు పునరావృతం చేసింది. దానికి ప్రధాన కారణం విరాట్ కోహ్లీ. అందువల్లే ఫైనల్ మ్యాచ్ ఆ స్థాయిలో వ్యూస్ నమోదు చేసింది. చివరికి భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను బీట్ చేయలేకపోయిందంటే.. విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version