Anil Ravipudi New Movie With Karthi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి… ఆయన తీసిన ప్రతి సినిమాతో సక్సెస్ ని సాధించడం ఆయన స్టైల్… ఇప్పటివరకు 9 సినిమాలు చేస్తే 9 సినిమాలను సక్సెస్ ఫుల్ గా నిలిపిన ఘనత కూడా తనకే దక్కుతుంది… ఆయన కామెడీ ఫ్యామిలీ ని ప్రధాన ఎజెండాగా పెట్టుకుని సినిమాలు చేస్తాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఆయన ‘ ‘బావ బామ్మర్ది’ అనే టైటిల్ ను రిజిస్ట్రేషన్ చేయించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో ఇద్దరు హీరోలు ఉండబోతున్నట్టుగా క్లారిటి అయితే ఇచ్చారు. గతంలో వెంకటేష్, ఫహాద్ ఫజిల్ ఈ సినిమాలో నటిస్తారనే వార్తలు వచ్చినప్పటికి ప్రస్తుతం ఆయన తమిళ హీరోని తీసుకోవడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది… తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపు పొంది తెలుగులో కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న కార్తీ ని ఈ సినిమాలో హీరోగా తీసుకోవాలని ఆయన భావిస్తున్నాడట. అలా అయితే అటు తమిళ్ మార్కెట్ ఇటు తెలుగు మార్కెట్ రెండు వర్కౌట్ అవుతాయనే ఉద్దేశ్యంతోనే కార్తీ ని ఈ సినిమాలో భాగం చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక రీసెంట్ గా కార్తీని కలిసి కథను కూడా వినిపించినట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా కార్తీ లాంటి హీరో అనిల్ రావిపూడి తో సినిమా చేస్తే ఆ సినిమా రేంజ్ మారిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసిన రాని గుర్తింపు కార్తీ అనిల్ రావిపూడి సినిమాలో చేస్తే వస్తుందని అతను కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కారణం ఏంటి అంటే కార్తీ కామెడీ ఎక్కువగా పండిస్తూ ఉంటాడు.
కాబట్టి ఆయన సినిమాలు కూడా కామెడీ ప్రధానంగా సాగుతూ ఉండటం వల్ల వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే నెక్స్ట్ లెవెల్ లో ఉండడమే కాకుండా ఇటు హీరోకి అటు దర్శకుడికి ఇద్దరికి మంచి పేరు వస్తుందనే నమ్మకంతో ఉన్నారు…
ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి చేసిన మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించి మంచి ఫామ్ లో ఉన్నాడు. కాబట్టి ఇక అదే ఊపులో ఈ సినిమాని కూడా చేసేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు.