మరో ప్రపంచ టెస్ట్ క్రికెట్ సమరానికి సర్వం సిద్ధమవుతోంది. ఇంగ్లండ్ లోని సౌతాంఫ్టన్ వేధికగా ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ జరుగబోతోంది. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే ప్రతిష్టాత్మక ఈ చాంపియన్ షిప్ ఫైనల్ కు మరో వారం మాత్రమే టైం ఉంది. ఈ టైటిల్ కోసం భారత క్రికెట్ జట్టు న్యూజిలాండ్ తో తలపడబోతోంది.
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల మధ్య జరిగిన టెస్టు మ్యాచ్ లలో అత్యధిక విజయాలతో భారత మొదటి స్థానంలో నిలవగా.. న్యూజిలాండ్ రెండో స్థానం దక్కించుకుంది. దీంతో ఈ రెండు టాప్ 2 జట్ల మధ్య ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఈనెల 18 నుంచి ఇంగ్లండ్ లో జరుగబోతోంది.
18న మధ్యాహ్నం 2 గంటలకు టాస్ వేస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. రాత్రి 11.30 గంటలకు మ్యాచ్ ముగిస్తుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ఆటగాళ్లు ఈరోజు నుంచి సాధన మొదలుపెట్టారు. ప్రస్తుతం న్యూజిలాండ్ టీం ఇంగ్లండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది.
సాయంత్రం పూటనే ఈ మ్యాచ్ ఉండడంతో ఇండియాలో ఈ లాక్ డౌన్ వేళ మ్యాచ్ చూసేందుకు అందరూ టీవీలకు అతుక్కుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ చానెల్ భారత్ లో ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది. స్థానిక భాషల్లోనూ ఇది కామెంట్రీ ఇస్తున్నారు. తెలుగులోనూ లైవ్ కామెంటరీ వినొచ్చు. హాట్ స్టార్ లోనూ లైవ్ చూడొచ్చు.
ప్రస్తుతం న్యూజిలాండ్ టీం సత్తా చాటుతోంది. అక్కడి పిచ్ లపై ఆడుతూ ఇంగ్లండ్ పైనే పైచేయి సాధించింది. దీంతో భారత్ తో టఫ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. భారత బ్యాట్స్ మెన్ ఏ మాత్రం రాణించకున్నా కూడా ఈ ఫైనల్ లో ఓటమి ఖాయం. ప్రపంచంలోని మేటి జట్ల మధ్య జరుగుతున్న ఈ సమరాన్నిచూసి ఎంజాయ్ చేయండి