అయితే, ఈలోగా మరో బుల్లి టీజర్ ను గంగవ్వ గాత్ర నేపథ్యంతో సిద్ధం చేసి, జనం మీదకు వదిలారు. ‘ఊ కొట్టే కథ చెబుతా. ఊ కొడతావా’ అంటూ తన మనవరాలికి ‘రాజు – దొంగ’ కథ చెపుతూ గంగవ్వ ఈ టీజర్ ను తన వాయిస్ ఓవర్ తో మొదలుపెట్టింది. 2డీ యానిమేషన్ లో రూపొందించిన ఈ టీజర్ లో సూర్యుడు నుంచి భూమి, భూమి నుంచి కోతి బంగారం పుట్టిందని, కోతి నుంచి మనిషి, బంగారం నుంచి కిరీటం పుట్టుకొచ్చాయంటూ’ ఆసక్తిని పెంచుతూ గంగవ్వ కథను చెప్పుకుంటూ పోయింది.
గంగవ్వ చెప్పిన కథలో మ్యాటర్ ఎంత ఉందనే విషయాన్ని పక్కన పెడితే.. ఆమె కథను చెప్పిన విధానం మాత్రం చాల బాగుంది. అలాగే, కథలో చూపించిన 2డీ యామినేషన్స్ కూడా చాలా సరదాగా సాగుతూ ఆకట్టుకున్నాయి. ఇక దొంగ ఒక రాజుగా, అదేవిధంగా రాజు ఒక దొంగగా మారిన వైనం కూడా ఫన్నీగా ఉంది. టైటిల్ ‘రాజ రాజ చోర’ కాబట్టి, కాన్సెప్టు కూడా ఈ ‘రాజు – దొంగ మార్పు’ మీదే ఉంటుందేమో.
మొత్తమ్మీద ఈ చిన్న టీజర్, ఈ సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేస్తూ అంచనాలను డబుల్ చేసింది. దీనిబట్టి శ్రీవిష్ణుకి ఈ సినిమాతో మరో భారీ హిట్ పడినట్టే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా కొత్త ఆలోచనలతో సాగుతుందట. అన్నట్టు ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, రవిబాబు, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. హసిత్ గోళీ దర్శకుడు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.