India Vs New Zealand: అది 2019 జూలై 9 వ తేదీ ఇండియా న్యూజిలాండ్ టీమ్ ల మధ్య మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియన్ టీమ్ ధోనీ అకారణం గా రన్ ఔట్ అవ్వడంతో 140 కోట్ల మంది భారతీయుల కల, కల గానే మిగిలిపోయింది.18 పరుగుల తేడా తో న్యూజిలాండ్ మీద ఇండియా ఓడిపోయి ఇంటి ముఖం పట్టింది. ప్రతి ప్లేయర్ కన్నీటి పర్యంతం అవ్వడం చూసిన ప్రతి అభిమానులు బోరున విలపించారు. దానికి సమాధానం చెప్పడానికి ఈ రోజు మ్యాచ్ లోకి ఇండియన్ టీమ్ బరిలోకి దిగుతుంది…గెలుపు అనే బాట లో భారత మాత ని గౌరవాన్ని నిలపడానికి ప్రతి ఇండియన్ గర్వం తో ఇది మా ఇండియన్ టీమ్ పవర్ అని మీసం మెలేసి రోషం చూపించాడని మన ప్లేయర్లు రెఢీ అవుతున్నారు. భారత మాత ఊపిరి పీల్చుకో ఈసారి పోరాటం లో మన ప్లేయర్లు చివరి వరకు రక్తం చిందించి అయిన కప్పు నీ ఒడి లో పెట్టడానికి సర్వం సిద్దం చేశారు…
ఇక ఇండియా న్యూజిలాండ్ తో అడబోయే ఈ మ్యాచ్ లో ఇండియన్ టీమ్ రివెంజ్ అనేది భారీ రేంజ్ లో ఉండబోతుంది. ఇక ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఏ ప్లేయర్ మన టీమ్ ని విజయతీరాలకు చేరుస్తాడు అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి బాల్ కూడా చాలా కీలకంగా మారనుంది. అలాగే ఇండియన్ టీం వేసే ప్రతి స్టెప్ కూడా ఆతితోచి వేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి గ్రౌండ్ లోకి దిగిన తర్వాత ఇండియన్ టీమ్ చివరి వరకు పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక లీగ్ లో ఇంతకుముందు సాధించిన తొమ్మిది విజయాలను గుర్తు చేసుకుంటూ పదో విజయానికి నాంది పలకడానికి ఇండియన్ ఇప్పటికీ తనదైన రీతిలో రంగం సిద్ధం చేసుకొని గెలుపు కోసం ఎదురుచూస్తూ కూర్చుంది…
అడవిలో సింహం జింక పిల్లను వేయడటానికి ముందు ఎంత ఓపిగ్గా అయితే ఎదురుచూస్తూ కూర్చుంటుందో ఇప్పుడు ఇండియన్ టీం కూడా అదే ఓపికతో గెలుపుని భుజాల పైన మూసుకు రావడానికి చాలా ఎదురుచూస్తూ కూర్చుంది. ఇదే టైంలో న్యూజిలాండ్ టీం కూడా తమదైన రీతిలో మరొకసారి 2019లో జరిగిన సిచువేషన్ ని రిపీట్ చేయాలనే ఉద్దేశ్యంతో భారీ కసరత్తులతో బరిలోకి దిగుతున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం గెలవకపోతే ఇండియన్ ప్లేయర్లు కూడా సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి నెలకొంటుంది…140 కోట్ల మంది పరువు నిలబెట్టడానికి 11 మంది ప్లేయర్లు గెలుపు అనే ఆశని వాళ్ల గుండెల్లో బలంగా నాటుకొని ముందుకు దూసుకెళుతున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఈ గెలుపుతో ఇండియన్ టీం ఫైనల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వాలని ఆశ భావాన్ని వ్యక్తం చేస్తుంది…