India Vs New Zealand Semi Final: ఇవాళ్ల ఇండియా న్యూజిలాండ్ టీమ్ లా మధ్య జరిగే సెమీఫైనల్ మ్యాచ్ లో ఎవరు ఆధిపత్యం వహిస్తారు అనే విషయం మీద చాలా రకాల చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే రెండు టీంలు కూడా తనదైన రీతిలో ముందుకు దూసుకువెళ్తున్న క్రమంలో ఈ మ్యాచ్ లో మాత్రం ఇండియన్ టీమ్ గెలిచి వాళ్ల సత్తా ఏంటో చూపించాలని చూస్తుంది. ఇక ఇండియన్ టీం కనక సూపర్ గా ఆడి ఈ మ్యాచ్ లో మంచి విజయాన్ని సాధించాలంటే మాత్రం మన ప్లేయర్లలో గిల్, రోహిత్ శర్మ,విరాట్ కోహ్లీ,శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ లాంటి ఈ ఐదుగురు ప్లేయర్లు కూడా చాలా మంచి పర్ఫామెన్స్ తో ఇవ్వాల్సి ఉంటుంది. అద్భుతంగా ఆడి ఇండియన్ టీమ్ కి ఒక అద్భుతమైన విజయాన్ని అందించడంలో వీళ్లు కీలకపాత్ర పోషించాల్సి ఉంటుంది. ఇక బౌలింగ్ లో బుమ్రా పవర్ ప్లే లో తన అద్భుతమైన స్పెల్ వేసి మొదట్లోనే కొన్ని వికెట్లు తీయాలి.
ఇక ఆ తర్వాత షమీ తనదైన రీతిలో రెచ్చిపోయి బౌలింగ్ చేయాల్సి ఉంటుంది ఇక మిడిల్ ఓవర్లలో ఇద్దరు స్పిన్నర్లు కూడా వాళ్ల సత్తా చాటాల్సి ఉంటుంది. ఇక మన బ్యాట్స్ మెన్స్ లలో ఉన్న టాప్ 5 మెంబర్స్ లో ఒక ముగ్గురు కరెక్ట్ గా పెద్ద ఇన్నింగ్స్ కనక అడగలిగితే మ్యాచ్ మన చేతిలోనే ఉంటుంది. అలా కాకుండా ఏమాత్రం మన ప్లేయర్లు కొంచెం తడబడిన కూడా న్యూజిలాండ్ టీమ్ కి అది అడ్వాంటేజ్ గా మారే అవకాశాలు ఉన్నాయి. అయితే న్యూజిలాండ్ టీమ్ కి మొదట్లో కొంత ఓపెనింగ్ భాగస్వామ్యం బాగా వచ్చినప్పటికీ కూడా మన బౌలర్లు ఎక్కడ కూడా అదైర్య పడకుండా సమిష్టిగా రాణిస్తూ టీమ్ స్పిరిట్ తో సత్తా చాటితేనే ఇండియన్ టీమ్ ఈ మ్యాచ్ లో విజయ తీరాలకి చేరుతుంది తప్ప ఏ కొంచెం తడబడిన కూడా మ్యాచ్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్లిపోయే అవకాశం అయితే ఉంది…
ఇక ఈ మ్యాచ్ లో ప్రతి ప్లేయర్ కూడా తమ వంతు కృషి అయితే చేయాల్సి ఉంటుంది అందులో భాగంగానే ఈ మ్యాచ్ గెలిచి ఇండియా ఫైనల్ కి చేరుకొని ఈసారి వరల్డ్ కప్ అందుకోవాలని ప్రతి ఇండియన్ అభిమాని కూడా కోరుకుంటున్నాడు ఇక ఈ ప్రాసెస్ లోనే ఇండియా ఫైనల్ చేరాలంటే ముందు ఈ మ్యాచ్ లో గెలవాల్సి ఉంటుంది…