Mohammed Shami: వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్ ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ ఎంతో ఉత్కంఠగా సాగింది. భారత్ ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి అడుగు పెట్టింది. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 397 పరుగుల స్కోర్ చేసింది. 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్.. 327 పరుగులుకు ఆలౌట్ అయింది. టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ షమీ మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచారు.
ఏడు వికెట్లు పడగొట్టిన షమీ..
ఈ మ్యాచ్ లో తన సంచలన ప్రదర్శనతో 7 వికెట్లు తీశాడు. డెవాన్ కాన్వేతోపాటు, రచిన్ రవీంద్ర వికెట్లు పడగొట్టి ఆదిలోనే కివీస్‌ను దెబ్బ తీశాడు షమీ. కివీస్ జట్టు 39 పరుగుల స్కోర్ కి 2 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్, డేరిల్ మిచెల్ 32.1 ఓవర్లలో 222/2 స్కోర్ చేశారు. తర్వాత షమీ వచ్చి రాగానే కేన్ విలియమ్సన్(69), టామ్ లాథమ్(0) ని అవుట్ చేశారు. మూడో స్పెల్‌లో మరో మూడు వికెట్లు పడగొట్టి మొత్తంగా ఏడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. 70 పరుగులు తేడాతో టీం ఇండియా గెలిచింది.
షమీపై మీమ్స్..
వరల్డ్ కప్ సెమీ ఫైనల్‌లో భారత్‌ను గెలిపించడంతో కీలకంగా మారిన షమీపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.
‘‘కప్ కొంచెం తుడిచి పెట్టండి.. న్యూజిలాండ్ వెల్ ప్లేయిడ్..
ఈ మ్యాచ్‌లో నీ ఫీల్డ్ సెట్టింగ్‌కి సలాం.. గులాం..
సెవెన్ వికెట్స్ హాలు బై షమీ.. ఇది సెమీ ఫైనల్ కాదు.. ‘షమీ’ ఫైనల్.. ఎంటర్ ఫైనల్స్.. రెండీ టూ కప్.. క్యాచ్ డ్రాప్.. బ్యాక్ టు బ్యాక్ వికెట్స్.. ఎక్కడ వదిలేశామో.. అక్కడే పట్టుకో.. పులి వేటకు వచ్చింది.. రివేంజ్ అదుర్స్ కదా.. షమీకి గుడి కట్టినా తప్పు లేదు..’’ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.