New Zealand Vs India (5)
New Zealand Vs India: ఒకానొక దశలో టీమిండియా 18.4 ఓవర్లలో ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 105 రన్స్ చేసింది. క్రీజ్ లో రోహిత్(76), గిల్(31) ఉన్నారు. ఇంకేముంది టీం ఇండియా గెలుపు నల్లేరు మీద నడక అనుకున్నారు. కానీ టీమిండియా పరిస్థితి తలకిందులు కావడానికి క్షణకాలం పట్టలేదు. గిల్ ను శాంట్నర్ అవుట్ చేసిన తర్వాత మ్యాచ్ స్వరూపం ఒక్కసారిగా మారిపోయింది.
105 పరుగుల వద్ద గిల్ అవుట్ అయిన వెంటనే.. మైదానంలోకి విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ ఛాంపియన్స్ ట్రోఫీలో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసి దూకుడు మీద ఉన్నాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. సెంచరీ ముందు అవుట్ అయినప్పటికీ.. విరాట్ గొప్పగా బ్యాటింగ్ చేశాడు.. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో మాత్రం విరాట్ కోహ్లీ కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి బ్రేస్ వెల్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఈ దశలో వచ్చిన శ్రేయస్ అయ్యర్(48) సమయోచితంగా ఆడినప్పటికీ.. సెంచరీ చేస్తాడనుకున్న రోహిత్ 76 రచిన్ రవీంద్ర బౌలింగ్ లో స్టంప్ అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా కష్టాల్లో పడింది. 105-1 నుంచి 122-3 కు చేరుకుంది. ఈ దశలో వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ (29) నాలుగో వికెట్ కు 61 పరుగులు జోడించారు. ఈ మ్యాచ్లో తొలి వికెట్ భాగ స్వామ్యం తర్వాత టీమ్ ఇండియా నెలకొల్పిన రెండవ అత్యుత్తమ పార్ట్ నర్ షిప్ ఇదే కావడం విశేషం. అయితే అయ్యర్ హాఫ్ సెంచరీ ముందు అవుట్ కావడంతో మరోసారి టీమిండియా పరిస్థితి తలకిందులైంది. ఇదే క్రమంలో అక్షర్ పటేల్ కూడా అవుట్ కావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారి పోయింది.
ఆదుకున్నారు
203-5 వద్ద కష్టాల్లో ఉన్న టీం ఇండియాను కేఎల్ రాహుల్(34), హార్దిక్ పాండ్యా(18) ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్ కు 38 పరుగులు జోడించారు. హార్దిక్ పాండ్యా అవుట్ అయిన తర్వాత రవీంద్ర జడేజా మైదానంలోకి వచ్చాడు. 9 నాట్ అవుట్ గా నిలిచాడు. మరో వైపు కే ఎల్ రాహుల్ భీకరంగా బ్యాటింగ్ చేసి విజయ లక్ష్యాన్ని పూర్తి చేశాడు…స్పిన్ కు సహకరించిన ఈ మైదానం చూస్తోన్న ప్రేక్షకులకు థ్రిల్లర్ మ్యాచ్ అనుభవాన్ని అందించింది. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల లాస్ అయ్యి 251 రన్స్ చేసింది. మిచెల్ 63, బ్రేస్ వెల్ 53 పరుగుల తో ఆకట్టుకున్నారు..వరుణ్ చక్రవర్తి, కుల దీప్ యాదవ్ చెరి రెండు వికెట్లు సాధించారు. వాస్తవానికి ఈ మైదానంపై 252 పరుగుల లక్ష్యాన్ని చేదించడం అంత సులభం కాదు. ముఖ్యంగా రోహిత్ శర్మ ప్రారంభంలో ఆడిన తీరు ఓ రేంజ్ లో ఉంది. అతడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు న్యూజిలాండ్ ప్లేయర్ల ముఖంలో నెత్తురు చుక్క లేదంటే అతిశయోక్తి కాదు. ఐతే ఆ సమయంలో భారత్ వెంట వెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యా చ్ ఒకసారిగా ఉత్కంఠ గా మారింది. చివరికి భారత్ విజేత గా నిలిచింది.