India vs New Zealand (4)
India vs New Zealand: దుబాయ్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ప్రత్యర్థి న్యూజిలాండ్ జట్టును మట్టి కరిపించింది. న్యూజిలాండ్ విధించిన 252 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించడంలో టీమిండియా ప్రారంభంలో దూకుడుగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. మైదానం స్పిన్ బౌలర్లకు సహకరిస్తున్న నేపథ్యంలో టీమ్ ఇండియా బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. గిల్, విరాట్ కోహ్లీ, పెవిలియన్ క్యు కట్టారు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ సింగిల్స్ తీస్తూ ఆకట్టుకున్నారు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేయడంతో మెరుగైన భాగస్వామ్యాన్ని నిర్మించారు. ఆ తర్వాత వీరిద్దరూ అవుట్ కావడంతో.. కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా తదుపరి ఘట్టాన్ని పూర్తిచేసే బాధ్యతను భుజాలకు ఎత్తుకున్నారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా అవుట్ అయినప్పటికీ.. రాహుల్ – రవీంద్ర జడేజా మిగతా లాంచనాన్ని పూర్తి చేశారు. ఇంకో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ గా ఫోర్ కొట్టి మ్యాచ్ ను గెలిపించాడు.
Also Read: క్షణం క్షణం ఉత్కంఠ.. బంతి బంతికి టెన్షన్.. వామ్మో సస్పెన్స్ థ్రిల్లర్ కూడా ఈ రేంజ్ లో ఉండదేమో..
దాండియా ఆడారు
ఫైనల్ మ్యాచ్లో టీమిండియా గెలవడంతో రోహిత్ శర్మ – విరాట్ కోహ్లీ (ROKO) మైదానంలో దాండియా ఆడారు. మ్యాచ్ గెలిచిన తర్వాత వికెట్లను చేతిలో పట్టుకొని.. సరదాగా స్టెప్పులు వేశారు. వికెట్లను పట్టుకొని వచ్చిన తర్వాత విరాట్ దాండియా ఆడదామని సైగ చేయగా.. దానికి రోహిత్ ఓకే అన్నాడు. వీరిద్దరూ బౌండరీ లైన్ వద్ద దాండియా ఆడారు. తమదైన స్టెప్పులు వేస్తూ అలరించారు. సాధారణంగా ఉత్తర భారతదేశంలో నవరాత్రి, హోలీ సందర్భంగా దాండియా ఆడుతూ ఉంటారు. అది అక్కడి ప్రజల సంప్రదాయం. టీమిండియా న్యూజిలాండ్ చేతిలో విజయం సాధించిన నేపథ్యంలో.. 13 సంవత్సరాల తర్వాత ఛాంపియన్ ట్రోఫీ గెలిచిన క్రమంలో ముందుగానే దేశ ప్రజలకు రోహిత్ – విరాట్ కోహ్లీ హోలీ పండుగను తీసుకొచ్చారు. వికెట్లతో దాండియా ఆడి ప్రేక్షకులను ఆనందింపజేశారు. వారిద్దరూ దాండియా ఆడుతున్నంతసేపు మైదానంలో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. రోకో రోకో అంటూ నినాదాలు చేశారు. రవీంద్ర జడేజా విన్నింగ్ షాట్ కొట్టగానే.. అది బౌండరీ దిశగా వెళ్లగానే ఒక్కసారిగా మైదానంలో కేరింతలు మొదలయ్యాయి. డ్రెస్సింగ్ రూమ్ లో ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఒక్కసారిగా మైదానంలోకి వచ్చారు. తమ ఆనందాన్ని రెట్టింపు చేసుకున్నారు.. న్యూజిలాండ్ ఆటగాళ్లు కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ తర్వాత విజయ గర్వంతో .. అభిమానులకు అభివాదాలు చేసుకుంటూ మైదానాన్ని విడిపోయారు.
Also Read: అక్షరాల 81+ కోట్ల వ్యూస్.. ఇండియా vs న్యూజిలాండ్ ఫైనల్ వ్యూస్ లలో రికార్డ్