India vs New Zealand (3)
Champions Trophy 2025: 13 సంవత్సరాల తర్వాత టీమ్ ఇండియా మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని అందుకుంది. 2017 లో జరిగిన చాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఓటమిపాలైంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో చిత్తయింది. ఈ క్రమంలో టీమిండియా ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. అప్పట్లో టీమ్ ఇండియా ఆటగాళ్లు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Also Read: ఫైనల్లో ఇండియా విక్టరీ.. స్టేడియంలోనే దాండియా ఆడిన రోహిత్-విరాట్
పాకిస్తాన్ చేతిలో ఓటమి ఎదురు కావడంతో టీమిండి ఆటగాళ్లకు సమాధానం ఏమని చెప్పుకోవాలో తెలియని దుస్థితి ఏర్పడింది. గ్లోబల్ మీడియా, స్వదేశీ మీడియా నాడు ఆటగాళ్ల తీరుపట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు. ఇక మాజీ సీనియర్ ఆటగాళ్లయితే దుమ్మెత్తి పోశారు. అసలు మీరు క్రికెట్ ఆడేందుకు పనికిరారు అంటూ మండిపడ్డారు. ఈ జాబితాలో మాజీ సీనియర్ ఆటగాడు సునీల్ గవాస్కర్ కూడా ఉన్నాడు. అతడైతే ఏకంగా ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించాలని.. దేశవాళి క్రికెట్ ఆడాలని డిమాండ్ చేశాడు. 2017లో ఎదురైన ఓటమికి టీమిండియా పలు సందర్భాల్లో పాకిస్తాన్ పై ప్రతీకారం తీర్చుకున్నప్పటికీ సగటు టీమిండి అభిమానిలో ఆ అసంతృప్తి తగ్గలేదు. ఇక చాంపియన్స్ ట్రోఫీ గెలిచామని ఆనందంలో పాకిస్తాన్ మీడియా వ్యవహరించిన తీరు భారత అభిమానులను ఇబ్బందికి గురిచేసింది. ఇక ఆటగాళ్లయితే చెప్పాల్సిన పనిలేదు. కొంతమంది టీమిండియా అభిమానులు తమ సామాజిక మాధ్యమ ఖాతాలను శాశ్వతంగా తొలగించారంటే నాడు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
చిన్నపిల్లడి లాగా..
టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో ఘనవిజయం సాధించడంతో దేశం మొత్తం సంబరాలు వ్యక్తం అవుతున్నాయి. నగరాలు, పట్టణాలు అని తేడా లేకుండా వేడుకలు జోరుగా సాగుతున్నాయి. న్యూజిలాండ్ పై ఫైనల్ మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించిన తర్వాత.. దుబాయ్ మైదానం ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఇండియా ఇండియా అభిమానులు నినాదాలు చేశారు. ప్రతి ఒక్క ఆటగాడిని అభినందించారు. ఫ్ల కార్డులు, ఫ్లెక్సీలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు సునీల్ గవాస్కర్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆట తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ 10 కాదు అంతకుమించి ఓవర్ల పాటు ఆడితేనే బాగుంటుందని వ్యాఖ్యానించాడు. దానికి తగ్గట్టుగానే రోహిత్ కూడా ఆడాడు. అయితే రచిన్ రవీంద్ర వేసిన అద్భుతమైన బంతిని అంచనా వేయలేక ముందుకు వచ్చాడు. కానీ న్యూజిలాండ్ కీపర్ బంతిని పట్టుకుని స్టంపులను గిరాటేశాడు. ఇక టీమిండియా ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం సునీల్ గవాస్కర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. టీమ్ ఇండియా ట్రోఫీని అందుకున్న తర్వాత అతడు స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. రెండు చేతులు పైకి లేపి.. తన వయసు కూడా లెక్కచేయకుండా కాళ్ళను లయబద్ధంగా కదిపాడు. మ్యాచ్ అనంతరం సునీల్ గవాస్కర్ చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో ఒక ఊపు ఊపుతోంది.. ఆరు పదుల వయసులోనూ సునీల్ గవాస్కర్ అంత ఉత్సాహంగా ఉండడాన్ని చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. టీమిండియా పై అతనికి ఉన్న అభిమానానికి ఫిదా అవుతున్నారు.