Homeక్రీడలుIND vs NZ : కాన్వే శతకం బాదినా... టీమిండియా చేతిలో న్యూజిలాండ్ కు వైట్...

IND vs NZ : కాన్వే శతకం బాదినా… టీమిండియా చేతిలో న్యూజిలాండ్ కు వైట్ వాష్ తప్పలేదు

IND vs NZ : ఈ ఏడాది స్వదేశంలో టీం ఇండియా రెండో వైట్ వాష్ చేసింది.. న్యూజిలాండ్ తో జరిగిన మూడు వన్డే ల సీరిస్ ను 3_0 తేడాతో గెలుపొందింది. ఇండోర్లో జరిగిన మూడో వన్డేలో 90 పరుగుల తేడాతో కివీస్ టీం ని ఓడించింది.. ఈ విజయంతో వరుసగా ఆరు వన్డేలు గెలిచి.. ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది.

-టాస్ గెలిచి బౌలింగ్

మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ లాథమ్ భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించాడు . అది ఎంత తప్పిదమైన నిర్ణయం తర్వాత అతనికి తెలిసింది. భారత ఓపెనర్లు గిల్, రోహిత్ శర్మ వచ్చి రాగానే న్యూజిలాండ్ బౌలర్లపై ఎదురు దాడికి దిగారు.. వన్డేల్లో టి20 తరహా బ్యాటింగ్ చేశారు.. ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు.. తొలి వికెట్ కు 212 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.. ముఖ్యంగా గిల్ అత్యద్భుతమైన ఫామ్ కొనసాగించాడు.. న్యూజిలాండ్ బౌలింగ్ ను ఊచ కోత కోశాడు. వీరిద్దరి ధాటికి న్యూజిలాండ్ కెప్టెన్ ఆరుగురు బౌలర్లను ఉపయోగించాల్సి వచ్చింది.. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది.. వీరిద్దరి జోరు చూసి భారత్ 400 పైచిలుకు పరుగులు చేస్తుందని అందరూ అనుకున్నారు.. 212 పరుగుల వద్ద వీరి భాగస్వామ్యానికి తెరదించిన న్యూజిలాండ్ బౌలర్లు… తర్వాత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.. కానీ చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో భారత్ 9 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది.

-కాన్వే అదరగొట్టాడు

సిరీస్ లో విఫలమౌతూ వస్తున్న కాన్వే ఫామ్ లోకి వచ్చాడు.. పరుగులేమి చేయకుండానే ఫిన్ అలెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఔట్ కావడంతో కాన్వే వన్ డౌన్ బ్యాట్స్మెన్ గా క్రీజ్ లోకి వచ్చాడు.. వచ్చి రాగానే తన బ్యాట్ కు పని చెప్పాడు.. హెన్రీ నికోలస్ తో కలిసి రెండో వికెట్ కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు.. అయితే ఈ దశలో నికోలస్ అవుట్ అయ్యాడు.. ఆ తర్వాత మిచెల్ తో కలిసి మూడో వికెట్ కు 78 పరుగులు జోడించాడు. కాన్వే క్రీజు లో ఉన్నంత సేపు భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. రన్ రేట్ 7 కు తగ్గకుండా న్యూజిలాండ్ పరుగులు సాధించింది అంటే అది కేవలం కాన్వే బ్యాటింగ్ వల్లే.. మిచెల్ అవుట్ అయిన తర్వాత కాన్వే కు ఏ ఒక్కరు కూడా సరైన తోడ్పాటు అందించలేదు.. ఇప్పటికే సెంచరీ పూర్తి చేసిన కాన్వే అలసిపోయాడు. అయినప్పటికీ 100 బంతుల్లో ఎనిమిది సిక్సర్లు, 12 ఫోర్ ల సహాయంతో 138 పరుగులు చేసి ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ లో రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

-నిరాశపరచిన బ్రేస్ వెల్

కాన్వే అవుట్ అయినప్పటికీ బ్రేస్ వెల్, శాంట్న ర్ మీద న్యూజిలాండ్ ఆశలు పెట్టుకుంది.. అయితే వీరు దాటిగా బ్యాటింగ్ చేసినప్పటికీ కులదీప్ యాదవ్, చాహల్ అద్భుతమైన బంతులు వేసి అవుట్ చేశారు.. దీంతో అప్పటికే న్యూజిలాండ్ మ్యాచ్ మీద ఆశలు వదిలేసుకుంది.. ఇక మిగతా బ్యాట్స్మెన్ అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు..మొత్తానికి 41.2 ఓవర్లలో న్యూజిలాండ్ 295 పరుగులకు ఆల్ అవుట్ అయింది.. భారత్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక భారత బౌలర్లలో శార్దుల్ ఠాకూర్ 3, కులదీప్ యాదవ్ 3, యజువేంద్ర చాహల్ 2, ఉమ్రాన్ మాలిక్ , హార్దిక్ పాండ్యా చేరి ఒక వికెట్ తీశారు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular