https://oktelugu.com/

India vs England : 45 సెకన్లకే పెవిలియన్‌.. రెప్ప పాటులో దొరికిన పోప్‌.. రోహిత్‌ సూపర్‌ క్యాచ్‌! వీడియో

పోప్‌ 29వ ఓవర్‌ రెండో బంతిని కట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. తొలి స్లిప్‌లో రోహిత్‌ శర్మ నిలిచాడు. బంతి ఎడమవైపు బ్యాట్‌ అంచుకు తాకింది.

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2024 / 03:58 PM IST

    Video of Rohit Sharma caught by Ollie Pope

    Follow us on

    India vs England : వైజాగ్‌ వేదికగా భారత్‌ – ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయం సాధించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. రెండో టెస్టులో నాలుగో రోజు ఇంగ్లండ్‌ ఓటమిలో కీలక భూమిక పోషించాడు. మూడో రోజే ఒక వికెట్‌ తీసి మంచి లైన్‌లో కనిపించిన అశ్విన్‌.. నాలుగో రోజు సత్తా చాటాడు. ఇంగ్లండ్‌ ఓటమిని శాసించాడు. మ్యాచ్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టాడు. స్లిప్‌లో అశ్విన్‌ వేసిన బంతికి అప్రమత్తమైన భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఓలీ పోప్‌కి క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్‌ను పూర్తి చేయడానికి రోహిత్‌ అర సెకను కంటే తక్కువ సమయం తీసుకున్నాడు. రోహిత్‌ క్యాచ్‌ పట్టిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    45 సెకన్లలోనే..
    పోప్‌ 29వ ఓవర్‌ రెండో బంతిని కట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. తొలి స్లిప్‌లో రోహిత్‌ శర్మ నిలిచాడు. బంతి ఎడమవైపు బ్యాట్‌ అంచుకు తాకింది. భారత కెప్టెన్‌ తన ఎడమ చేతిని ముందుకు కదిలించి రెప్పపాటులో ఈ క్యాచ్‌ పట్టాడు. ఈ క్యాచ్‌ను రోహిత్‌ 0.45 సెకన్లలో పూర్తి చేశాడు. దీంతో ప్రమాదకరంగా మారిన పోప్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. ఈ ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ అప్పటికే 21 బంతుల్లో 23 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు ఉన్నాయి. పోప్‌ తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో పోప్‌ 196 పరుగులు చేసి భారత్‌ నుంచి విజయాన్ని లాక్కున్న సంగతి తెలిసిందే.

    టెస్టులో రోహిత్‌ 57 క్యాచ్‌లు..
    ఇక రోహిత్‌ శర్మ తన కెరీర్‌లో ఇప్పటి వరకు 57 క్యాచ్‌లు పట్టాడు. భారత్‌ తరఫున టెస్టుల్లో ఎక్కువ క్యాచ్‌లు పట్టిన 15వ ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటి వరకు 56 టెస్ట్‌ మ్యాచ్‌లు ఆడాడు. ఈ జాబితాలో 163 టెస్టుల్లో 209 క్యాచ్‌లు పట్టిన రాహుల్‌ ద్రవిడ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు.