https://oktelugu.com/

Heroines: హీరోయిన్ ను మించి క్రేజ్ సంపాదించిన సైడ్ బ్యూటీలు వీరే..

యానిమల్.. యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తే.. ఈయన సరసన రష్మిక మందన జతకట్టింది. ఇందులో ఒక చిన్న పాత్రలో నటించిన త్రిప్తి దిమ్రీ రష్మికా కన్నా కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : February 5, 2024 / 04:08 PM IST
    Follow us on

    Heroines: సినిమాలో హీరోయిన్స్ అయితే తప్ప పాపులారిటీ రాదు అనుకునే రోజులు కాదు ఇవి. సోషల్ మీడియా ద్వారా చాలా మంది పాపులర్ అవుతున్నారు. ఇక సినిమాల్లో అయితే సైడ్ క్యారెక్టర్లుగా చేసిన వారు హీరోయిన్ లుగా కూడా నటిస్తున్నారు. ఇలా సపోర్టింగ్ క్యారెక్టర్స్, సైడ్ క్యారెక్టర్లు చాలా పాపులర్ అవుతున్నారు. అదే రేంజ్ లో క్రేజ్ ను కూడా సంపాదిస్తున్నారు. డైలాగ్స్ లేకపోయినా, కొన్ని ఉన్నా కూడా ప్రేక్షకులపై మంచి ప్రభావం చూపించి గుర్తింపు సంపాదించేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అంటే 2023 నుంచి ఇప్పటి వరకు దాదాపు ఐదుగురు నటీమణులు ఫుల్ క్రేజ్ సంపాదించారు. వారు ఎవరో ఓ సారి లుక్ వేయండి..

    యానిమల్.. యానిమల్ సినిమాలో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తే.. ఈయన సరసన రష్మిక మందన జతకట్టింది. ఇందులో ఒక చిన్న పాత్రలో నటించిన త్రిప్తి దిమ్రీ రష్మికా కన్నా కూడా ఎక్కువ క్రేజ్ ను సంపాదించుకుంది. అదే రేంజ్ లో యూత్ లో ఫాలోయింగ్ ను సంపాదించింది కూడా ఈ బ్యూటీ. ఈ సినిమాలో సంపాదించిన క్రేజ్ తో ప్రభాస్ సినిమాలో కూడా సెలెక్ట్ అయింది త్రిప్తి.

    వీర సింహారెడ్డి.. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమాలో శృతి హాసన్ తో పాటు హనీ రోజ్ కూడా ఊహించని రేంజ్ లో క్రేజ్ ను సంపాదించింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో నటించడం విశేషం.

    అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్..ఫిదాలో హీరోయిన్ అక్క పాత్రలో నటించిన శరణ్య ప్రదీప్ మంచి పేరును సంపాదించింది. ఇలా ఎన్నో సినిమాల్లో ఛాన్స్ ను సంపాదించి ప్రస్తుతం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలో సుహాన్ అక్క పాత్రలో కూడా నటింటి మంచి మార్కులు సంపాదించుకుంది.

    సలార్.. సలార్ సినిమాలో విలన్ పాత్రలో నటించిన శ్రేయ రెడ్డి గతంలో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమా తర్వాతే ఆమె పాత్రకు మంచి గుర్తింపు లభించింది.

    మంగళవారం.. పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించిన మంగళవారం సినిమా అభిమానుల్లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కానీ.. ఈమెకు మించిన క్రేజ్ ను సంపాదించుకుంది జమీందారు భార్యగా నటించిన దివ్య పిళ్లై.