India vs England : ప్రస్తుతం ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఒకే ఒక్క దేశం ఇండియా…ఇక ఇప్పుడు మన టీమ్ ను ఓడించడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. మన బౌలర్లను ఎదుర్కోవాలంటే ప్రత్యర్థి బ్యాట్స్ మెన్స్ కి దమ్ము ఉండాలి ,అలాగే మన బ్యాట్స్ మెన్స్ కి బౌలింగ్ చేయాలంటే ఆపోజిట్ బౌలర్లకు చాలా ధైర్యం ఉండాలి. అనే విషయాన్ని ప్రతి సారి మన ప్లేయర్లు ప్రూవ్ చేస్తూ వస్తున్నారు.
ఇక ఇలాంటి నేపథ్యంలో ఇండియన్ టీమ్ పేరు చెప్తేనే ప్రస్తుతం ప్రపంచ దేశాల క్రికెట్ ప్లేయర్లు భయంతో వణికి పోతున్నారు. ఇండియన్ టీమ్ కి ఎప్పుడో ఒకసారి కొన్ని అనుకోని పరిస్థితుల వాళ్ల పరాజయాలు వస్తాయి తప్ప, వరుసగా ఇండియన్ టీమ్ ను ఓడించే సత్తా ఉన్న టీమ్ ఈ భూమ్మీద లేదనే చెప్పాలి. ఇక ఇప్పుడు మూడు ఫార్మాట్లలో ఇండియన్ టీం ను ఢీకొట్టే సత్తా ఉన్న టీమ్ కనుచూపుమేరలో కూడా మరొకటి కనిపించడం లేదు అంటే మన టీమ్ బలం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఇండియా అన్ని ఫార్మాట్లలో మొదటి స్థానంలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఇంగ్లాండ్ తో ఆడుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో ఇండియా భారీ విజయాన్ని సాధించింది. ఇంకొక రోజు మిగిలి వుండగానే ఈ మ్యాచ్ ను గెలిచి మరొకసారి ఇండియన్ టీం సత్తా ఏంటో ఇంగ్లాండ్ టీమ్ కి చూపించింది. పుష్ప సినిమా లో పుష్ప రాజ్ చెప్పినట్టు గా ‘తగ్గేదెలే’ అనే రేంజ్ లో ఇండియా ఈ మ్యాచ్ లో విక్టరీ కొట్టింది. మొదటి మ్యాచ్ లోనే ఇండియా భారీ విజయాన్ని అందుకోవాల్సింది. కానీ మన ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా కి తొడ కండరాలు పట్టుకోవడం వల్ల ఆ మ్యాచ్ లో ఇండియన్ టీం 28 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.
ఇక దాంతో ఈ మ్యాచ్ ను కసిగా తీసుకున్న మన ప్లేయర్లు ఈ మ్యాచ్ లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగారు. మొదటి ఇన్నింగ్స్ లో జైశ్వాల్ తన పంజాని విసిరి డబుల్ సెంచరీ సాధిస్తే, మన బౌలర్ అయిన బుమ్రా ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించడమే కాకుండా 6 వికెట్లను తీసి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు… ఇన్ని రోజులు ఒక లెక్క ఇప్పుడు ఒక లెక్క ప్రస్తుతం ఇండియాని ఓడించాలంటే ప్రత్యర్థి టీమ్ ఏదైనా తన బలం సరిపోదు అనేలా తయారైంది. ఇండియాలో ప్రపంచంలోనే అత్యంత బెస్ట్ బ్యాట్స్ మెన్స్, బౌలర్స్, ఆల్ రౌండర్లు ఉన్నారు. ఇక ఇది ఇలా ఉంటే ఈ మ్యాచ్ లో ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 396 పరుగులు చేయగా, ఇంగ్లాండ్ 253 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో ఇండియా 255 పరుగులు చేసింది. ఇక దాంతో 398 టార్గెట్ తో రెండు ఇన్నింగ్స్ లో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ప్లేయర్లు భారత బౌలర్ల దాటికి తట్టుకోలేక చేతులెత్తేశారు.
ముఖ్యంగా బుమ్రా ఒక అదిరిపోయే స్పెల్ వేసి మూడు వికెట్లను తీశాడు. అలాగే అశ్విన్ కూడా 3 వికెట్లు తీశాడు.దాంతో ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ అందరూ పెవిలియన్ బాట పట్టారు. వాళ్ల ఓపెనర్ ప్లేయర్ అయిన క్రవ్ లే ఒక్కడే 73 పరుగులు చేసి కొంతవరకు ఇంగ్లాండ్ టీం ని ఆదుకునే ప్రయత్నం చేశాడు. కానీ మన బౌలర్ల దాటికి ఎదుర్కోలేక తను కూడా ఔట్ అయి పోయాడు. ఇక ఆయన్ని మినహాయిస్తే మిగిలిన ప్లేయర్లు ఎవరు కూడా పెద్దగా ఆడలేకపోయారు.
దాంతో ఇంగ్లాండ్ టీం భారీపరాజయాన్ని మూట కట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో బుమ్రా అత్యద్భుతమైన బౌలింగ్ చేసి తొమ్మిది వికెట్లు తీసి ఇండియన్ టీం కి భారీ విక్టరీని అందించాడు.ఈ మ్యాచ్ జైశ్వాల్ , గిల్ ఇద్దరు అద్భుతమైన సెంచరీ లు చేశారు. బుమ్రా బాల్ తో రెచ్చిపోయాడు, దాంతో వీళ్ళు ముగ్గురు కలిసి ఈ మ్యాచ్ ను దగ్గరుండి మరి గెలిపించారనే చెప్పాలి…