https://oktelugu.com/

India Vs England 2nd test: 2వ టెస్ట్ లో ఇండియా గెలవాలంటే ఇదొక్కటే దారి..

ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ ని చేజేతులారా జారవిడుచుకున్న ఇండియన్ టీం రెండో మ్యాచ్ మీద భారీ ఆశలు పెట్టుకొని బరిలోకి దిగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు ప్రతి ఒక్కరు తమదైన రీతిలో సత్తా చాటితెనే మరోసారి ఇండియా విజయకేతనాన్ని ఎగరవేస్తుంది.

Written By:
  • Gopi
  • , Updated On : February 2, 2024 / 10:17 AM IST
    Follow us on

    India Vs England 2nd test: ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఈరోజు రెండవ టెస్ట్ మ్యాచ్ విశాఖపట్నం లోని వైయస్సార్ ఏసీఏ -విడిసిఏ పిచ్ లో జరగనుంది. ఈ మ్యాచ్ లో ఇండియన్ టీం ఎలాగైనా గెలిచి తమ ఆధిపత్యాన్ని చూపించుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఐదు టెస్ట్ మ్యాచ్ ల్లో భాగంగా ఇంగ్లాండ్ టీమ్ ఇప్పటికే మొదటి టెస్ట్ మ్యాచ్ ను గెలిచి తన ఆధిపత్యాన్ని చూపించుకుంది.

    ఇక ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి మ్యాచ్ ని చేజేతులారా జారవిడుచుకున్న ఇండియన్ టీం రెండో మ్యాచ్ మీద భారీ ఆశలు పెట్టుకొని బరిలోకి దిగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో ఇండియన్ ప్లేయర్లు ప్రతి ఒక్కరు తమదైన రీతిలో సత్తా చాటితెనే మరోసారి ఇండియా విజయకేతనాన్ని ఎగరవేస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో 190 పరుగుల ఆదిపత్యంతో ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ బస్ బాల్ గేమ్ ఆడి మ్యాచ్ మొత్తాన్ని తమ వైపు తిప్పేసుకుంది. ఆ మ్యాచ్ లో మన ప్లేయర్ల పేలవమైన పర్ఫామెన్స్ మన టీమ్ ఓడిపోవడానికి ముఖ్య కారణం అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా ఆ మ్యాచ్ లో కీలక పాత్ర వహించిన రవీంద్ర జడేజా, కే ఎల్ రాహుల్ లాంటి దిగ్గజ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో అందుబాటులో లేకపోవడం ఇండియన్ టీం కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

    ఇక వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ కుల్దీప్ యాదవ్, రజత్ పాటిధర్ లాంటి ప్లేయర్లు టీమ్ లోకి వచ్చినప్పటికీ వాళ్ళ ప్లేస్ ని రీప్లేస్ చేసే అంత కెపాసిటీ ఉన్న ప్లేయర్లు వీళ్ళు కాదనే చెప్పాలి. మరి ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇండియన్ టీం ని ఏ ప్లేయర్లు విజయ తీరాలకు చేరుస్తారు అనేది కూడా కీలకంగా మారింది. ఒకవైపు ఇంగ్లాండ్ టీమ్ ను చూసుకుంటే బ్యాటింగ్ లోను, బౌలింగ్ లోను అద్భుతమైన ఫామ్ లో ఉంది కాబట్టి వాళ్ళ ఫామ్ కి కళ్ళెం వేస్తూ మ్యాచ్ ని మన వైపు తిప్పే ఆ ప్లేయర్లు ఎవరు అనేది ఇక్కడ సందేహాత్మకంగా మారింది. ఇక విశాఖపట్నం పిచ్ కూడా ఉప్పల్ లాగే స్పిన్ కి ఎక్కువగా అనుకూలిస్తుంది. కాబట్టి ఇక్కడ కుల్దీప్ యాదవ్ తన మ్యాజిక్ ని చూపించాలి, లేకపోతే మాత్రం ఇండియన్ టీమ్ భారీ ఇబ్బందులను ఎదుర్కోక తప్పదు.

    ఇంగ్లాండ్ టీమ్ లో మొదటి మ్యాచ్ లో ఎలాగైతే పోప్ ఒక్కడే మ్యాచ్ మొత్తాన్ని ఇంగ్లాండ్ టీమ్ వైపు తిప్పేసాడో అలాంటి ప్లేయర్ కూడా ఇప్పుడు ఇండియన్ టీం కి అవసరం ఉంది. ఇక ఇప్పటికే ఇండియన్ టీం టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కాబట్టి మొదటి ఇన్నింగ్స్ లో భారీ పరుగులు చేస్తే తప్ప ఈ మ్యాచ్ లో విజయం అనేది ఈజీగా అయితే రాదు.

    ఇండియన్ టీం మొదటి ఇన్నింగ్స్ లో భారీ పరుగులు చేసి, తక్కువ పరుగులకే ఇంగ్లాండ్ టీమ్ ని కట్టడి చేసి ఫాలో అన్ కూడా దాటకుండా చేయాలి. ఇక సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా బ్యాటింగ్ వాళ్ళకే ఇచ్చి అప్పుడు కూడా తొందరగా కట్టడి చేస్తే ఇండియన్ టీమ్ ఇంగ్లాండ్ మీద తన ఆధిపత్యాన్ని చూపించే అవకాశం అయితే ఉంటుంది. మరి అలాంటి పరిస్థితి రావాలి అంటే ఇండియన్ టీమ్ బ్యాట్స్ మెన్స్ భారీ పరుగులు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆడాల్సి ఉంటుంది.

    కాబట్టి ఈ మ్యాచ్ ఎటువైపు నుంచి చూసిన రెండు టీమ్ ల బలాబలాలు సమానంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇంగ్లాండ్ టీమ్ ని కట్టడి చేస్తేనే ఇండియా ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుంది. లేకపోతే మాత్రం మొదటి మ్యాచ్ లో రిపీట్ అయిన సిచువేషన్ ఈ మ్యాచ్ లో కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి.