India Vs England Test Series: స్కై స్పోర్ట్స్ ప్రసారం చేసిన వార్త కథనం ప్రకారం.. టీమిండియా కు త్వరలో టెస్ట్ సారధి రాబోతున్నాడు. రోహిత్ శర్మ అనుహ్యంగా టెస్ట్ ఫార్మాట్ నుంచి శాశ్వతంగా తప్పుకున్నాడు. దీంతో సారధిని ఎంపిక చేయాల్సిన బాధ్యత సెలక్టర్ల మీద పడింది. అంతేకాదు వచ్చే నెల నుంచి ఇంగ్లాండ్ లో టీమిండియా పర్యటిస్తోంది. ఏకంగా ఐదు టెస్టులు ఆడుతుంది. ఈ సిరీస్ ద్వారా టీమ్ ఇండియా 2025 -27 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్ మొదలు పెడుతుంది. మొత్తంగా ఈ సైకిల్ లో టీమిండియా ఆడే అతిపెద్ద టెస్ట్ సిరీస్ లలో ఇదే పెద్దది. ఆస్ట్రేలియాతో కూడా టీమిండియా ఐదు టెస్టులు ఆడాల్సి ఉంది. కంగారులతో కంటే ముందు ఇంగ్లాండ్ తో ఆడాల్సి ఉంది కాబట్టి.. ఇదే అతిపెద్ద టెస్ట్ సిరీస్.. అందువల్ల ఇంగ్లాండ్ జట్టుతో జరిగే టెస్ట్ సిరీస్ కు టీమిండియా మేనేజ్మెంట్ విపరీతమైన ప్రాధాన్యం ఇస్తోంది. కచ్చితంగా ఇంగ్లాండ్ జట్టుపై టెస్ట్ సిరీస్ విజయాన్ని నమోదు చేయాలని బలమైన పట్టుదలతో ఉంది. అందువల్లే జట్టులో పూర్తిస్థాయిలో యువ రక్తాన్ని ఎక్కిస్తోంది. ఇప్పటికే టెస్టు జట్టు ఎంపికకు సంబంధించి మేనేజ్మెంట్ ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రవీంద్ర జడేజా, బుమ్రా మినహా జట్టులో మొత్తం యువ ఆటగాళ్లతో నింపాలని భావిస్తున్నట్టు సమాచారం.
Also Read: వైభవ్ సూర్య వంశీకి ప్రీతి జింటా హగ్.. క్లారిటీ!
ఇక స్కై స్పోర్ట్స్ నివేదిక ప్రకారం శుభ్ మన్, రిషబ్ సాధారణ ఆటగాళ్లుగా మాత్రమే ఉంటారని.. కెప్టెన్ గా నియమించడానికి వీరిద్దరినిమేనేజ్మెంట్ పరిగణలోకి తీసుకోవడం లేదని తెలుస్తోంది. అనుభవం.. ఆటతీరు దృష్ట్యా బుమ్రా కు సారధ్య బాధ్యతలు అప్పగించవచ్చని స్కై స్పోర్ట్స్ తన కథనంలో పేర్కొంది. ఒకవేళ గాయాలు.. ఇతర విషయాలను కనుక పరిగణలోకి తీసుకుంటే రవీంద్ర జడేజాకు నాయకత్వ బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదని స్కై స్పోర్ట్స్ వెల్లడించింది. ఇటీవల టీమిండియా సీనియర్ ఆటగాడు.. రవిచంద్రన్ అశ్విన్ ఇదే విషయాన్ని వెల్లడించాడని స్కై స్పోర్ట్స్ తన కథనంలో ఉటంకించింది. అంతేకాదు రవీంద్ర జడేజా బంతితో మాత్రమే కాకుండా బ్యాట్ తో కూడా అదరగొడతాడని స్కై స్పోర్ట్స్ పేర్కొంది. అయితే టీమిండియా కు ప్రస్తుతం టెస్ట్ ఫార్మాట్లో భారీ విజయాలు కావాలి. భారీ విజయాలు కావాలంటే బలమైన సారధి కావాలి. అటు బుమ్రా, ఇటు రవీంద్ర జడేజా బలమైన సారధులు అవుతారా? టీమ్ ఇండియాను బలమైన జట్టుగా నిలబెడతారా? అనే ప్రశ్నలకు మాత్రం స్కై స్పోర్ట్స్ సమాధానం చెప్పలేదు. త్వరలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ ముగుస్తున్నందున టీమ్ ఇండియాకు కాబోయే టెస్ట్ సారధి ఎవరనే విషయంపై ఒక స్పష్టత వస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి.