India Vs England 5th Test: అది 2017.. ఆస్ట్రేలియా జట్టు.. ధర్మశాల వేదిక .. విభిన్నమైన బౌలింగ్ తీరుతో ఓ యువకుడు భారత్ తరఫున టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన మెలికలు తిప్పే బోలింగ్ తో ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు. నాలుగు వికెట్లు పడగొట్టాడు. అలా ఇండియాకు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. ఆ బౌలర్ అదే వేదిక మీద గురువారం కూడా విజృంభించాడు. అప్పుడు నాలుగు వికెట్లు తీస్తే.. ఇప్పుడు ఆస్ట్రేలియా మీద ఐదు వికెట్లు తీశాడు. అంతేకాదు టెస్టుల్లో 50 వికెట్ల మైలురాయి కూడా అందుకున్నాడు. ఆ బౌలరే కులదీప్ యాదవ్.
చైనా మెన్ గా ప్రసిద్ధి చెందిన కులదీప్ యాదవ్ ఇంగ్లాండ్ జట్టుతో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో మెరిశాడు. మెలికలు తిప్పే బంతులు వేసి ఇంగ్లాండ్ జట్టును కోలుకోలేని దెబ్బతీశాడు. క్రావ్ లే, డకెట్, పోప్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్ వంటి కీలకమైన ఆటగాళ్ల వికెట్లు తీసి ఇంగ్లాండ్ జట్టును ఇబ్బందుల్లోకి నెట్టాడు. అతడికి రవిచంద్రన్ అశ్విన్, జడేజా కూడా తోడు కావడంతో ఇంగ్లాండ్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
కెరియర్లో 100వ టెస్టు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్ హార్ట్ లీ, మార్క్ వుడ్ వికెట్లు తీశాడు. రాజ్ కోట్ లో టెస్ట్ క్రికెట్ లో 500 వికెట్లు సాధించిన మైలురాయి అందుకున్న అశ్విన్..రాంచీ, ధర్మశాల లోను అదే ఊపును కొనసాగించాడు. ఇక రవీంద్ర జడేజా కూడా రూట్ ను ఔట్ చేసి సత్తా చాటాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో 8 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
4⃣th FIFER in Tests for Kuldeep Yadav!
What a performance this has been!
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @imkuldeep18 | @IDFCFIRSTBank pic.twitter.com/zVGuBFP92l
— BCCI (@BCCI) March 7, 2024