https://oktelugu.com/

Best Milage Car: మోటార్ సైకిల్ అంత మైలేజ్ ఇచ్చే ఈ కారు గురించి తెలుసా?

బైక్ కంటే కారు మెయింటనెన్స్ ఎక్కువగా ఉన్నా ప్రయాణాతో పాటు సౌకర్యంగా ఉంటుంది. అలాంటి కార్లను కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మరి ఆ కారు గురించి తెలుసుకుందామా..

Written By:
  • Srinivas
  • , Updated On : March 7, 2024 / 02:10 PM IST

    Alto K 10 Milage Car

    Follow us on

    Best Milage Car: ప్రయాణాల కోసం ఒకప్పుడు ద్విచక్రవాహనాలను మాత్రమే వాడేవారు. కానీ ఆదాయం పెరిగే కొద్దీ ఒకేసారి నలుగురు ప్రయాణించే 4 వీలర్ కోసం ఆరాటపడుతున్నారు. ఇప్పుడు కొన్ని కార్లు బైక్ రేంజ్ లోనే మైలేజ్ ఇవ్వడంతో ద్విచక్ర వాహనాల కంటే కారు బెటర్ అని ఆలోచిస్తున్నారు. అయితే బైక్ కంటే కారు మెయింటనెన్స్ ఎక్కువగా ఉన్నా ప్రయాణాతో పాటు సౌకర్యంగా ఉంటుంది. అలాంటి కార్లను కొన్ని కంపెనీలు ఇప్పటికే మార్కెట్లోకి తీసుకొచ్చాయి. మరి ఆ కారు గురించి తెలుసుకుందామా..

    దేశంలో అత్యధిక కార్ల విక్రయాలు జరుకునే కంపెనీల్లో మారుతి సుజుకీ ఒకటి. ఈ కంపెనీ హ్యాచ్ బ్యాక్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్ల వరకు ఉత్పత్తి చేస్తుంది. అయితే అత్యధికంగా మైలేజ్ ఇచ్చే కార్లను మారుతి మాత్రమే తీసుకొస్తుందన్న వాదన ఉంది. ఇందులో భాగంగా మారుతి సుజుకీ రిలీజ్ చేసిన ఆల్టో కె 10 గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆల్టో కే 10 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటు CNG వెర్షన్ లో కూడా లభిస్తుంది. ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ , ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి.

    Alto K 10 Milage Car 1

    బైక్ కంటే కారు ధర ఎక్కువగా నే ఉంటుంది. కానీ బైక్ ఇచ్చే మైలేజ్ మాత్రం దాదాపు ఆల్టో కే 10 ఇవ్వగలదు. ఇది లీటర్ పెట్రోల్ కు 28 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇవ్వగలదు. CNG ఎంపికలో 36 కిలోమీటర్ల వరకుదూసుకెళ్తుంది. మైలేజ్ దాదాపు ఓకే గానీ.. కారు నిర్వహణ ఎక్కువగా ఉంటుందని చాలా మంది అభిప్రాయం. కానీ మారుతి ఆల్టో కే 10 నిర్వహణ పెద్ద భారంగా ఉండదు. ఇందులో బూట్ స్పేస్ 214 లీటర్ల వరకు ఉంటుంది. దీని కోసం ఏడాదికి రూ.5వేల నుంచి రూ.6 వేల వరకు సర్వీస్ ఛార్జ్ గా భరిస్తే సరిపోతుందని విక్రయదారులు చెబుతున్నారు.

    మారుతి ఆల్టో కే 10 మొత్తం 7 వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, కీ లెస్ ఎంట్రీ వంటి ఫీచర్లు ఆకర్షిస్తాయి. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, మాన్యువల్ అడ్జస్టబుల్ ఓఆర వీఎం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆల్టో కే 10ను దక్కించుకోవాలంటే మిగతా కార్ల కంటే తక్కువ. దీనిని కేవలం రూ.3.99 లక్షల ప్రారంభం నుంచి రూ.5.99 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఆల్టో కే 10 బేజ్ వేరియంట్ రోడ్డుపైకి రావడానికి రూ.4.43 లక్షలు అవుతుంది.