IND Vs ENG: రవిచంద్రన్ అశ్విన్ మరోసారి తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ జట్టుతో జరుగుతున్న ఐదవ టెస్టులో మెలికలు తిప్పే బంతులు సంధిస్తున్నాడు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్లు కోల్పోయింది.. ఇందులో అశ్విన్ తీసినవే నాలుగు వికెట్లు ఉండడం విశేషం. అశ్విన్ కు ఇది 100 టెస్ట్ కావడం విశేషం.. అయితే తొలి ఇన్నింగ్స్ లో అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు.. బ్యాటింగ్లో మాత్రం సున్నా పరుగులకు అవుట్ అయి చెత్త రికార్డు మూట కట్టుకున్నాడు.. 0 పరుగులకు అవుట్ అయ్యాననే బాధో, ఎక్కువ టికెట్లు తీయాలనే తలంపో తెలియదు గాని.. ధర్మశాల టెస్టులో రెండవ ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టుకు చుక్కలు చూపిస్తున్నాడు.
రోహిత్ శర్మ, గిల్ సెంచరీలు చేయడం, యశస్వి జైస్వాల్, పడిక్కల్, సర్ఫ రాజ్ హాఫ్ సెంచరీలతో మెరవడంతో.. భారత్ 477 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ జట్టు 218 పరుగులకు ఆల్ అవుట్ అయింది. దీంతో భారత జట్టుకు 259 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండవ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు అశ్విన్ ధాటికి వణికిపోయింది. రెండు పరుగులకే డకెట్(2) అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఓపెనర్ క్రావ్ లే(0) అశ్విన్ బౌలింగ్లో డక్ ఔట్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 21 పరుగులు మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ఓలీ పోప్(19) ధాటిగా ఆడేందుకు ప్రయత్నించి అశ్విన్ బౌలింగ్ లో జై స్వాల్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ 36 పరుగులు.. ఆ తర్వాత వచ్చిన జో రూట్(34), బెయిర్ స్టో(39) ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్ కు 59 పరుగులు జోడించారు. ఈ క్రమంలో 17.4 ఓవర్ వద్ద బెయిర్ స్టో (39) ను కులదీప్ అవుట్ అయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 92 పరుగులకు నాలుగు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజ్ లోకి వచ్చిన కెప్టెన్ బెన్ స్టోక్స్ కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోర్ ఐదు వికెట్ల నష్టానికి 103 పరుగులు.. ఇప్పటికి ఇంగ్లాండు ఇంకా 156 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజ్ లో జో రూట్(34), బెన్ ఫోక్స్(0) ఉన్నారు. లంచ్ బ్రేక్ కు ముందు ఇంగ్లాండ్ 103/5 వద్ద ఉంది.
అశ్విన్ జోరు చూస్తుంటే ఇంగ్లాండ్ జట్టు నిలబడగలుగుతుందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మైదానం స్పిన్ బౌలింగ్ కు సహకరిస్తున్న నేపథ్యంలో అశ్విన్ బంతిని మెలికలు తిప్పుతున్నాడు. తొలి ఇన్నింగ్స్ లో కులదీప్ యాదవ్ ఐదు వికెట్లు తీస్తే.. అశ్విన్ నాలుగు వికెట్లు తీశాడు. ఇప్పుడు రెండవ ఇన్నింగ్స్ లో ఇప్పటికే అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఐదు వికెట్ల ఘనతకు ఒక వికెట్ దూరంలో ఉన్నాడు. కులదీప్ యాదవ్ ఒక వికెట్ సాధించాడు. మైదానం స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో.. కెప్టెన్ రోహిత్ శర్మ రవిచంద్రన్ అశ్విన్, కులదీప్ యాదవ్ తోనే బౌలింగ్ చేయిస్తున్నాడు. అద్భుతం జరిగితే తప్ప ఇంగ్లాండ్ జట్టు ఇన్నింగ్స్ ఓటమి నుంచి గట్టెక్కడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.
Chipping away and how!
A wicket right at the stroke of lunch for R Ashwin!
England 5 down.
Follow the match ▶️ https://t.co/jnMticF6fc #TeamIndia | #INDvENG | @IDFCFIRSTBank pic.twitter.com/OMDunncfz2
— BCCI (@BCCI) March 9, 2024