https://oktelugu.com/

India vs England cricket : 4వ టెస్టు నేటి నుంచి.. టీం ఇదే.. గెలుపెవరిది?

India vs England cricket: మొదటి రెండు టెస్టుల దాకా భారత్ దే ఆదిపత్యం.. కానీ మూడో టెస్ట్ నుంచి సీన్ మారింది. ఇంగ్లండ్ బాగా పుంజుకుంది. టీమిండియాను చిత్తుగా ఓడించి షాక్ ఇచ్చింది. రెండో టెస్టులో కోహ్లీ సేన సాధించిన అద్భుత విజయాన్ని మూడో టెస్టు తుడిచేసింది. భారత్ బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యంతో కథ మొదటికొచ్చింది. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. మరో టెస్ట్ గెలిస్తే […]

Written By:
  • NARESH
  • , Updated On : September 2, 2021 / 10:26 AM IST
    Follow us on

    India vs England cricket: మొదటి రెండు టెస్టుల దాకా భారత్ దే ఆదిపత్యం.. కానీ మూడో టెస్ట్ నుంచి సీన్ మారింది. ఇంగ్లండ్ బాగా పుంజుకుంది. టీమిండియాను చిత్తుగా ఓడించి షాక్ ఇచ్చింది. రెండో టెస్టులో కోహ్లీ సేన సాధించిన అద్భుత విజయాన్ని మూడో టెస్టు తుడిచేసింది. భారత్ బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యంతో కథ మొదటికొచ్చింది. ప్రస్తుతం ఇండియా, ఇంగ్లండ్ లు చెరో మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచాయి. మరో టెస్ట్ గెలిస్తే ఏ జట్టుకైనా సిరీస్ ఓడిపోయే ప్రమాదం తప్పుతుంది.. ఈ నేపథ్యంలోనే ఓవర్ మైదానంలో గురువారం నుంచి నాలుగో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇరు జట్లు ఈ టెస్ట్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్నాయి.

    లీడ్స్ టెస్టులో విజయంతో ఇంగ్లండ్ జట్టు ఆత్మవిశ్వాసంతో ఉంది. ఇక ఇండియా ఓటమితో కసిగా ఉంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ఓవల్ మైదానంలో ప్రారంభం కానుంది.

    టీమిండియాకు మిడిల్ ఆర్డర్ వైఫల్యం కలవర పెడుతోంది. కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానే, కీపర్ పంత్ లు వరుసగా విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఆఫ్ స్టంప్ అవతల పడుతున్న బంతులను ఆడలేక అవుట్ అయిపోతున్నారు. రహానేను తప్పిస్తే ఆఫ్ స్పిన్ కూడా వేయగల హనుమ విహారికి చోటు కల్పించే అవకాశాలు ఉన్నాయి. అయితే అదనపు బ్యాట్స్ మెన్ తీసుకోవాలనుకుంటే ఫృథ్వీ, సూర్యకుమార్, మయాంక్ అగర్వాల్ లో ఒకరికి అవకాశం దక్కవచ్చు.

    ఇక నాలుగో టెస్ట్ జరిగే ఓవల్ స్పిన్నర్లకు సహకరిస్తుంది. అందుకే సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు చోటు కల్పించారు. ఇటీవల కౌంటీల్లో అశ్విన్ 6 వికెట్లతో చెలరేగడం కూడా చూశాం. ఇంగ్లండ్ లో ఆడిన అనుభవం కూడా అతడి సొంతం. ఇక ఇషాంత్ కు బదులుగా శార్ధుల్ ఠాకూర్ జట్టులోకి రావచ్చు. శార్దుల్ బ్యాట్ తోపాటు బంతితో కూడా రాణించగలడు.

    – తుది భారత్ జట్టు అంచనా ఇదీ
    భారత్: కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, చేతశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ(కెప్టెన్) , అజింక్యా రహానే, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా/ శార్దుల్ ఠాకూర్, ఆర్ అశ్విన్, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.