Huzurabad Bypoll: హుజురాబాద్ ఉప ఎన్నికకు (Huzurabad Bypoll) నోటిఫికేషన్ రాబోతోందనే సంకేతాలు వస్తున్నాయి. దీంతో పార్టీల్లో అలజడి రేగుతోంది. ప్రచారంలో తలమునకలై పోతున్నాయి. రాష్ర్టవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అధికార పార్టీ టీఆర్ఎస్ నా, బీజేపీనా అనే అనుమానం అందరిలోనూ కనిపిస్తోంది. దీంతో పార్టీలు కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉన్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ దళితబంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని చూస్తున్నా బీజేపీ మాత్రం సానుభూతితోనే గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొనడా సాధారణమే.
హుజురాబాద్ లో పరిస్థితిపై ఎన్నికల సంఘం బుధవారం ఆరా తీసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో సమీక్షించింది. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్, వైద్యారోగ్య శాఖ అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. హుజురాబాద్ పరిధిలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఎలా ఉందని అడిగారు. కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయా? అని ప్రశ్నించారు. టీకాల పంపిణీ కొనసాగుతోందా అనే విషయాలపై అడిగి తెలుసుకున్నారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికపై నోటిఫికేషన్ అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పార్టీలు కూడా తమ ప్రచారం ముమ్మరం చేయాలని భావిస్తున్నాయి.
అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీలో నిలిచారు. కానీ కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన మాత్రం చేయలేదు. కానీ కొండా సురేఖ వైపు మొగ్గుచూపుుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నికలో హోరాహోరీ ప్రచారం సాగనుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే బీజేపీ ప్రజాదీవెన యాత్ర పేరిట నియోజకవర్గాన్ని చుట్టుముట్టగా టీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో తన ప్రచారం చేసింది. ఇక కాంగ్రెస్ మాత్రం తన గళం ఇంతవరకు విప్పలేదు. దీన్ని సాధారణంగా తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది.
ఏదిఏమైనా హుజురాబాద్ ఉప ఎన్నిక రాష్ర్టవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అధికార పార్టీ టీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. బీజేపీ కూడా అంతే స్థాయిలో టీఆర్ఎస్ ను ఓడించాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల ప్రచారం ఇప్పటికే హోరందుకుంది. సమఉజ్జీలుగా రెండు పార్టీలు దూసుకుపోతున్నాయి. అధికార పార్టీ టీఆర్ఎస్ దళిత బంధు పథకంతో ఓట్లు కొల్లగొట్టాలని భావిస్తోంది. నియోజకవర్గ వ్యాప్తంగా దళితులందరికి దళితబంధు అందజేస్తామని ప్రకటించి ముందంజలో ఉంది. దీంతో ఓటర్లు ఏం తీర్పు ఇస్తారో అనే అనుమానం అందరిలో నెలకొంది.
కేసీఆర్ కూడా హుజురాబాద్ పై ప్రత్యేక దృష్టి సారించినట్లు సమాచారం. అందుకే ఏ ఎన్నిక కోసం ఇంతలా ప్రచారం చేయని కేసీఆర్ హుజురాబాద్ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది ఇక్కడ ఓడితే పరువు పోతుందనే ఉద్దేశంతోనే అధికార పార్టీ శక్తియుక్తుల్ని ధారపోస్తోందని చెబుతున్నారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికపై దేశవ్యాప్తంగా కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోందని తెలుస్తోంది.