Ind vs Eng: నిలబడ్డ పంత్, జడేజా.. పట్టుబిగించిన భారత్

ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో చివర్లో భారత టెయిలండర్లు రిషబ్ పంత్, జడేజా నిలబడడంతో తొలిఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఏకంగా 364 పరుగులు చేసి ఇంగ్లండ్ కు సవాల్ విసురుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ 129 పరుగులతో శతకం బాదడంతో ఈ భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. అజింక్యా రహానే(1) నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్, జడేజాలు నిలకడగా ఆడారు. వీరిద్దరూ ఆరోవికెట్ కు 49 […]

Written By: NARESH, Updated On : August 13, 2021 7:48 pm
Follow us on

ఇంగ్లండ్ తో జరిగిన రెండో టెస్టులో చివర్లో భారత టెయిలండర్లు రిషబ్ పంత్, జడేజా నిలబడడంతో తొలిఇన్నింగ్స్ లో భారత్ భారీ స్కోర్ చేసింది. ఏకంగా 364 పరుగులు చేసి ఇంగ్లండ్ కు సవాల్ విసురుతోంది.

తొలి ఇన్నింగ్స్ లో ఓపెనర్ కేఎల్ రాహుల్ 129 పరుగులతో శతకం బాదడంతో ఈ భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. అజింక్యా రహానే(1) నిరాశపరిచాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పంత్, జడేజాలు నిలకడగా ఆడారు. వీరిద్దరూ ఆరోవికెట్ కు 49 పరుగులు జోడించి టీమిండియా ఆధిక్యం పెరిగేలా చేశారు. పంత్ 37, జడేజా 40 పరుగులతో వేగంగా పరులు చేయడంతో భారత్ కు పరుగులు పోటెత్తాయి. పంత్ మంచి ఫామ్ లో ఉండగా ఔట్ కావడం నిరాశ పరిచింది.

పంత్ 331 పరుగుల వద్ద ఆరో వికెట్ గా అవుట్ కావడంతో ఇక టీమిండియా ఎంతో సేపు నిలవలేకపోయింది. మరుసటి ఓవర్ లోనే షమి (0)కు ఔట్ అయ్యి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత జడేజా, ఇషాంత్ కాస్త నిలకడగా ఆడినా.. ఇషాంత్ ఔట్ కావడంతో బుమ్రా ఎక్కువ సేపు నిలవలేదు.

ఇక ఇంగ్లండ్ బౌలర్లలో అండర్సన్ నిప్పులు చెరిగాడు. చివరి వికెట్లను వేగంగా తీశాడు. ఏకంగా 5 వికెట్లు తీసి టీమిండియాను కట్టడి చేశాడు. రాబిన్ సన్, మార్క్ వుడ్ చెరో రెండు వికెట్లు తీశారు.