Hardik Pandya: విడాకులన్నారు.. ఆడలేడన్నారు కదరా.. కోత మొదలైంది.. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు..

టీమిండియా వైస్ కెప్టెన్ గా బంగ్లాదేశ్ పై శనివారం అమెరికా వేదికగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. సంజు సాంసన్ ఒక్క పరుగు చేసి నిరాశపరిచినప్పటికీ.. ఆ ప్రభావం జట్టు స్కోరు మీద పడకుండా రిషబ్ పంత్ చూసుకున్నాడు.

Written By: Anabothula Bhaskar, Updated On : June 2, 2024 7:50 am

Hardik Pandya

Follow us on

Hardik Pandya: “విడాకులు తీసుకున్నాడు.. మ్యాచ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు. టీమిండియా మొత్తం అమెరికా వెళ్ళిపోతే అతడు ఎక్కడో లండన్ లో ఉన్నాడు. ఇంతకీ టి20 వరల్డ్ కప్ లో ఆడతాడా? ఇప్పుడున్న పరిస్థితుల్లో అతడు ఆడటం కష్టమే. పైగా ముంబై ఇండియన్స్ జట్టును ఏకతాటిపై నిలపలేకపోయాడు. దారుణమైన ఓటములను అందించాడు. అలాంటివాడు t20 వరల్డ్ కప్ లో మాత్రం ఏం ఆడుతాడు” ఇవీ హార్దిక్ పాండ్యా పై ఇటీవల కాలంలో వినిపించిన విమర్శలు. భార్య నటాషా తో విడాకులు తీసుకున్నాడనే వదంతులు రావడంతో.. హార్దిక్ పాండ్యా పై మీడియాలో రోజుకో తీరుగా విమర్శలు, ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. గాలి వ్యాఖ్యలు చేస్తున్న వారికి తన బ్యాటింగ్, బౌలింగ్ తో సమాధానం చెప్పాడు హార్థిక్ పాండ్యా.

టీమిండియా వైస్ కెప్టెన్ గా బంగ్లాదేశ్ పై శనివారం అమెరికా వేదికగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో అదరగొట్టాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 23 పరుగులకే అవుట్ అయినప్పటికీ.. సంజు సాంసన్ ఒక్క పరుగు చేసి నిరాశపరిచినప్పటికీ.. ఆ ప్రభావం జట్టు స్కోరు మీద పడకుండా రిషబ్ పంత్ చూసుకున్నాడు. అతడు రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగితే.. హార్దిక్ పాండ్యా మిగతా బాధ్యతను నెత్తికి ఎత్తుకున్నాడు. 23 బంతుల్లో నాలుగు సిక్స్ లు, రెండు ఫోర్ లతో ఏకంగా 40* పరుగులు చేశాడు. చాలా రోజుల తర్వాత మైదానంలో తన పాత ఆటను అభిమానులకు పరిచయం చేశాడు. మైదానంలోకి వచ్చిందే మొదలు దూకుడే మంత్రంగా హార్దిక్ ఆడాడు. బంగ్లా బౌలర్ల తో ఏదో దీర్ఘకాలిక వివాదం ఉన్నట్టు చెలరేగి బ్యాటింగ్ చేశాడు.. అతడు బ్యాటింగ్ చేస్తుంటే మైదానం మొత్తం హోరెత్తిపోయింది.. కసి కొద్ది సిక్స్ లు, ఫోర్లు కొడుతుంటే టీమిండియా స్కోర్ బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది..

అప్పటిదాకా రిషబ్ పంత్ వాయువేగంతో బ్యాటింగ్ చేసి..రిటైర్డ్ హర్ట్ గా వెనుతిరిగితే.. అతడి బాధ్యతను హార్దిక్ భుజాలకు ఎత్తుకున్నాడు. తిరుగులేని విధంగా బ్యాటింగ్ చేస్తూ బంగ్లా బౌలర్లను ఒక ఆట ఆడుకున్నాడు. తనను గెలికితే ఎలా ఉంటుందో ట్రోలర్స్ కు హార్దిక్ పాండ్యా చూపించాడు. హార్దిక్ పాండ్యా బీభత్సమైన బ్యాటింగ్ పట్ల సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. ” విడాకులన్నారు. ఆడలేడన్నారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాడో.. కోత మొదలైంది.. రాత రాసిన భగవంతుడు కూడా ఆపలేడు” అని అర్థం వచ్చేలా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.