India vs Bangladesh : ఏషియా కప్ లో భాగం గా సూపర్ ఫోర్ లో ఇండియా బంగ్లాదేశ్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకి 265 పరుగులు చేయడం జరిగింది. బంగ్లాదేశ్ టీం లో కెప్టెన్ అయిన శకిబుల్ హాసన్ 80 పరుగులు చేశాడు,ఇక హ్రిడి 54 పరుగులు చేశారు. ఇక నసం అహ్మద్ కూడా చివర్లో 44 పరుగులు చేశాడు దాంతో బంగ్లాదేశ్ టీం 50 ఓవర్లకి 265 పరుగులు చేసింది… ఇక ఇండియన్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు తీశాడు, మహమ్మద్ షమీ రెండు వికెట్లు తీశాడు ఇక ప్రసిద్ధి కృష్ణ అక్షర పటేల్,రవీంద్ర జడేజా తలో వికెట్ తీశారు. ఇక 266 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇండియా టీం కి మొదట్లోనే పెద్ద దెబ్బ తగిలింది.కెప్టెన్ రోహిత్ శర్మ డక్ ఔట్ అవ్వడంతో ఇండియా టీంకి మొదట్లోనే కోలుకోలేని దెబ్బ పడిందనే చెప్పాలి… ఇక ఈ మ్యాచ్ లో కోహ్లీ హార్దిక పాండ్య ఇద్దరు కి కూడా రెస్ట్ ఇవ్వడం జరిగింది…ఇక వీళ్ళ ప్లేస్ లో తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ లు టీమ్ లోకి.వచ్చారు…ఇక రోహిత్ శర్మ అవుట్ అయ్యాక మరో ఓపెనర్ అయిన గిల్ చాలా వరకు నిలకడగా ఆడుతూ బంగ్లాదేశ్ బౌలర్లను చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఒక అద్భుతమైన సంచరిని కూడా సాధించాడు.133 బంతుల్లో 5 సిక్స్ లు, 8 ఫోర్లతో 121 పరుగులు చేశాడు…
ఇక ఆయన తర్వాత ఆల్ రౌండర్ అయిన అక్షర పటేల్ 42 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ 19 పరుగులు చేయగా,సూర్య కుమార్ యాదవ్ 26 పరుగులు మాత్రమే చేశాడు.ఇక టీం లో ఉన్న బ్యాట్స్ మెన్స్ వరుసగా ఫెయిల్ అయ్యారు. ఇక కోహ్లీ ప్లేస్ లో ఆడిన తిలక్ వర్మ కూడా పెద్దగా ప్రభావాన్ని చూపించలేకపోయాడు. ఇక చివరి వరకు గెలుపు కోసం పోరాటం చేసిన కూడా ఇండియా టీమ్ బంగ్లాదేశ్ పైన 6 రన్స్ తేడాతోఓడిపోవడం జరిగింది…బంగ్లాదేశ్ బౌలర్లు అయిన సకిబ్ 2 వికెట్లు తీశాడు అలాగే ముస్తిఫిజర్ రహమాన్ 3 వికెట్లు తీశాడు,అలాగే మహది హాసన్ 2 వికెట్లు,శకిబుల్ హాసన్ 1 వికెట్ తీశారు.హాసన్ మిరజ్ ఒక వికెట్ తీశాడు..
ఇలా బంగ్లాదేశ్ బౌలర్లు కొద్దివరకు బాగానే బౌలింగ్ చేశారని చెప్పాలి… ఇక 80 రన్స్ కొట్టి ఆ టీమ్ ఎక్కువ రన్స్ చేయడం లో కీలక పాత్ర వహించి అలాగే బౌలింగ్ లో కూడా సత్తా చాటి ఒక వికెట్ తీసిన శకిబుల్ హాసన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు…