Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ తెలుగు 7 రెండో వీకెండ్ కి చేరుకుంది. ఆదివారం ఒకరు ఇంటిని వీడాల్సి ఉంటుంది. ప్రేక్షకుల ఓటింగ్ లో వెనుకబడిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారు. ఫస్ట్ వీక్లో 8 మంది నామినేట్ అయ్యారు. నటి కిరణ్ రాథోడ్ కి తక్కువ ఓట్లు పోల్ కావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యింది. మొదటివారం ఇంటిని వీడిన కంటెస్టెంట్ గా ఆమె రికార్డులకు ఎక్కారు. కిరణ్ రాథోడ్ నిష్క్రమణతో హౌస్లో 13 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో 9 మంది ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు.
పల్లవి ప్రశాంత్ ని అత్యధికంగా 8 మంది నామినేట్ చేశారు. ఇక నామినేషన్స్ లో ఉన్న పేర్లు పరిశీలిస్తే… పల్లవి ప్రశాంత్, టేస్టీ తేజా, శోభా శెట్టి, షకీలా, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, శివాజీ, అమర్ దీప్ లతో పాటు ప్రిన్స్ యావర్ ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ మంగళవారం రాత్రి నుండి మొదలైంది. ఎప్పటిలాగే పల్లవి ప్రశాంత్ ఓటింగ్ లో దూసుకుపోయాడు. అతనికి 40% ఓటింగ్ పడినట్టు సమాచారం.
పల్లవి ప్రశాంత్ సింపతీ కార్డ్ వాడుతున్నాడు, అతడిది అంతా ఫేక్ గేమ్ అని కంటెస్టెంట్స్ ఆరోపణలు చేశారు. అలాగే సోషల్ మీడియాలో కొందరు అతన్ని ట్రోల్ చేస్తున్నారు. అయినా జనాల్లో అతనికి ఆదరణ తగ్గలేదని మరోసారి రుజువైంది. పల్లవి ప్రశాంత్ అనంతరం శివాజీ రెండో స్థానంలో ఉన్నాడట. వీరి తర్వాత అమర్ దీప్ మూడు, రతికా రోజ్ నాలుగో స్థానంలో ఉన్నారట. ఇక ఐదో స్థానంలో యావర్ ఉన్నారట.
ఫస్ట్ వీక్ డేంజర్ జోన్లో ఉన్న యావర్ తన ఆట తీరుతో ప్రేక్షకుల్లో పాపులారిటీ తెచ్చుకున్నాడు. అతని స్థానాలు మెరుగయ్యాయి. ఇక ఆరో స్థానంలో టేస్టీ తేజా, ఏడో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్నారట. చివరి రెండు స్థానాల్లో టాప్ సెలెబ్స్ శోభా శెట్టి, షకీలా ఉన్నారట. ఆ లెక్కన శోభా శెట్టి, షకీలా డేంజర్ జోన్లో ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు.