Kalki Movie : ప్రభాస్ ఒకటి మూడు చిత్రాలు చేస్తున్నారు. సలార్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. ఈ నెల 23న విడుదల కావాల్సి ఉండగా చిత్ర యూనిట్ వాయిదా వేశారు. అన్ని విధాలా బెస్ట్ క్వాలిటీ ఫిల్మ్ ఇచ్చేందుకే డిలే అని వివరణ ఇచ్చారు. కొత్త విడుదల తేదీ త్వరలో ప్రకటిస్తారు. కల్కి, మారుతీ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. దర్శకుడు నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్షన్ మూవీగా కల్కి తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ ఆకట్టుకుంది. కల్కి రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతుంది.
ఇక మారుతి మూవీ హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటుంది. లేటెస్ట్ షెడ్యూల్ నందు కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా సెట్స్ నుండి ఓ వీడియో లీకైంది. హీరోయిన్ మాళవిక మోహనన్ మీద ఫైట్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్నారు. సెటప్ చూస్తే మార్కెట్ లో ఫైట్ అని తెలుస్తుంది. మాళవికకు రోప్స్ కట్టారు. ఆమె గాల్లోకి ఎగిరి రౌడీలను దుమ్మురేపుతోంది.
హీరోయిన్ కి కూడా ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయని తాజా లీక్ తో అర్థమైంది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి డీలక్స్ రాజా అనే టైటిల్ ప్రచారం అవుతుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారని సమాచారం. అనూహ్యంగా ఇది కామెడీ హారర్ చిత్రం అంటున్నారు. ఆ జోనర్లో ప్రభాస్ మూవీ చేయడం అంటే కొంచెం నమ్మడం కష్టమే. మరి చూడాలి ప్రభాస్ వంటి బడా స్టార్ ని మారుతి ఎలా డీల్ చేస్తాడో.
మరోవైపు ప్రభాస్ మోకాలి సర్జరీ కోసం యూకే వెళ్లాడని సమాచారం. కొన్నాళ్లుగా మోకాలి నొప్పితో బాధపడుతున్న ప్రభాస్ వైద్యుల సూచన మేరకు సర్జరీ చేయించుకుంటున్నారట. సర్జరీ అనంతరం నాలుగు వారాలకు పైగా రెస్ట్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇక ప్రభాస్ కి అర్జెంటుగా ఓ హిట్ కావాలి. బాహుబలి అనంతరం ప్రభాస్ ఖాతాలో హిట్ లేదు. సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ నిరాశపరిచాయి.
Indian wonder women #malavikamohanan's – Maruthi currently shooting Action sequence
In Hyderabad pic.twitter.com/G2XcDE0xTr
— 000009 (@ui000009) September 15, 2023