India vs Australia : టీమిండియాలో చేజింగ్ మాస్టర్ ఎవరంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు విరాట్ కోహ్లీ. ఇటీవల ఛాంపియన్ ట్రోఫీ లీగ్ సమరంలో భాగంగా పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఏకంగా సెంచరీ చేశాడు. చాలాకాలం తర్వాత శతకం కొట్టి అదరగొట్టాడు. అయితే అదే ఊపు న్యూజిలాండ్ జట్టు మీద కొనసాగించలేకపోయాడు. ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ 84 పరుగులు చేశాడు. గిల్, రోహిత్ శర్మ స్వల్ప వ్యవధిలో అవుట్ అయిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ శ్రేయస్ అయ్యర్ తో కలిసి మెరుగైన భాగస్వామ్యాన్ని నిర్మించాడు. అంతేకాదు ఆస్ట్రేలియా బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఏకంగా 84 పరుగులు చేసి.. త్రుటిలో సెంచరీ కోల్పోయాడు. అయినప్పటికీ కష్ట కాలంలో టీమిండియాను ఆదుకొని ఆపద్బాంధవుడుగా నిలిచాడు. సెంచరీ కోల్పోయిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ అభిమానులు బాధపడుతున్నప్పటికీ.. విరాట్ కోహ్లీ మాత్రం సరికొత్త రికార్డు సృష్టించాడు. అంతేకాదు సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు.
Also Read : రివేంజ్ అదిరిపోలా.. విరాట్ పరాక్రమ చేజింగ్..పాండ్యా, కేఎల్ పవర్ ఫుల్ బ్యాటింగ్.. నాకౌట్ లో ‘ఆస్ట్రేలియా ఔట్
ఐసీసీ వన్డే టోర్నమెంట్లలో..
ఐసీసీ వన్డే టోర్నమెంట్ లో ఇప్పటివరకు ఎక్కువ 50 + పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండుల్కర్ పేరు మీద రికార్డు ఉండేది. అతడు 58 ఇన్నింగ్స్ లలో 23 సార్లు 50 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. అయితే అతడి రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాడు. ఆస్ట్రేలియా పై ఆఫ్ సెంచరీ చేయడం ద్వారా 53 ఇన్నింగ్స్ లలో 24 హాఫ్ సెంచరీల కంటే ఎక్కువ పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. విరాట్ తర్వాత సచిన్, వచ్చిన తర్వాత స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. రోహిత్ శర్మ 42 ఇన్నింగ్స్ లలో 18 కంటే ఎక్కువ హాఫ్ సెంచరీలు చేశాడు. ఇక శ్రీలంక ఆటగాడు కుమార సంగక్కర 56 ఇన్నింగ్స్ లలో 17 సార్లు 50 ప్లస్ స్కోర్ సాధించాడు. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 60 ఇన్నింగ్స్ లలో 16 సార్లు 50 ప్లస్ స్కోర్ చేశాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో విరాట్ కోహ్లీ సెంచరీ కోల్పోయినప్పటికీ.. సచిన్ రికార్డును బద్దలు కొట్టడం పట్ల అతడి అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టి సరికొత్త ఆటగాడిగా నిలిచిన విరాట్ కోహ్లీకి అభినందనలు తెలియజేస్తున్నారు. ” టీమిండియా కు అతడు ఒక వజ్రాయుధం. అద్భుతంగా ఆడుతాడు. సూపర్ బ్యాటింగ్ తో ఆకట్టుకుంటాడు. అందువల్లే అతడు సచిన్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఇకపై కూడా మిగతా రికార్డులను బద్దలు కొట్టి సరికొత్త ఆటగాడిగా నిలుస్తాడని” విరాట్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానిస్తున్నారు.
Also Read : ఆస్ట్రేలియా దిగ్గజం పాంటింగ్ రికార్డు బద్దలు. సరికొత్త ఘనత సృష్టించిన విరాట్ కోహ్లీ..