IND vs AUS “అతని బ్యాటింగ్ నాకు నచ్చుతుంది. టీమిండి ఆడే మ్యాచ్లు చూస్తానో లేదో తెలియదు కాని.. కేఎల్ రాహుల్ ఆడే మ్యాచ్ లు మాత్రం కచ్చితంగా చూస్తాను.. అతని బ్యాటింగ్ బాగుంటుంది. ఆడే విధానం గొప్పగా ఉంటుంది. డిఫెన్స్ ఆడేటప్పుడు అలానే అతుక్కుపోతాడు. షాట్ల ఎంపికలో కొన్నిసార్లు మీరు మిగతా అన్నిసార్లు కచ్చి తత్వాన్ని ప్రదర్శిస్తాడు. అందువల్లే అతడు నాకు నచ్చుతాడు.” ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. టీమిండియా మాజీ కోచ్, లెజెండరీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్. రాహుల్ ద్రావిడే కేఎల్ రాహుల్ కు సరైన శిక్షణ ఇచ్చాడు. టీమ్ ఇండియాలోకి వచ్చిన తర్వాత రాహుల్ కు టెక్నిక్ లు నేర్పాడు.. అందువల్లే రాహుల్ మిడిల్ ఆర్డర్లో కీలక ఆటగాడిగా నిలిచాడు. కొన్నిసార్లు ఓపెనర్ గా.. మరికొన్నిసార్లు వన్ డౌన్ బ్యాటర్ గా.. ఇలా జట్టు అవసరాలు తీర్చుతూ కీలక ఆటగాడిగా నిలిచాడు. కానీ ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ గా వచ్చాడో.. అప్పటినుంచి రాహుల్ తో ఆడుకోవడం మొదలుపెట్టాడు. అసలు రాహుల్ ద్వారా జట్టు అవసరాలు ఎలా తీర్చుకోవాలో తెలియక.. గౌతమ్ గంభీర్ పక్కన పెట్టాడు. చివరికి ఛాంపియన్స్ ట్రోఫీలో అజిత్ అగార్కర్ ఒత్తిడి మేరకు తీసుకున్నాడు. అదికూడా అయిష్టంగానే.. అయినప్పటికీ రాహుల్ తన మీద మేనేజ్మెంట్ ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయలేదు. దానికి నిదర్శనమే ఆస్ట్రేలియాపై ఆడిన ఇన్నింగ్స్..
ఒక దశలో శ్రేయస్ అయ్యర్ అవుట్ అయ్యాడు. అక్షర్ పటేల్ కూడా కొద్దిసేపటికి అదే దారిని అనుసరించాడు. కానీ కేఎల్ రాహుల్ మాత్రం స్థిరంగా ఆడాడు. తను ఎంత బలంగా నిలబడితే.. జట్టుకు అంత భారం తగ్గుతుందని భావించాడు. అందువల్లే కేఎల్ రాహుల్ స్థిరమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేఎల్ రాహుల్ ను అవుట్ చేస్తే మ్యాచ్ గెలుస్తామని స్మిత్ కు తెలుసు. అందువల్లే తన బౌలర్లను మొత్తం ప్రయోగించాడు.. అయినప్పటికీ రాహుల్ లొంగలేదు. ఒకానొక దశలో విరాట్ కోహ్లీ తొందరపడి సెంచరీ మిస్ చేసుకున్నప్పటికీ.. కేఎల్ రాహుల్ స్థిర చిత్తాన్ని ప్రదర్శించాడు. అందువల్లే 42 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అంతేకాదు హార్దిక్ పాండ్యా దూకుడుగాడి తనను హాఫ్ సెంచరీ చేసుకొనివ్వకపోయినప్పటికీ.. రాహుల్ ఆ బాధను మాత్రం తన మనసులో కనిపించనీయ లేదు. అంతేకాదు 2023లో ఆస్ట్రేలియా వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఓడించిన బాధను తీర్చుకోవాలని భావించాడు. అందువల్లే ఆస్ట్రేలియాపై కసిగాడి.. తను ఎంత స్పెషలో రాహుల్ నిరూపించాడు. మిడిల్ ఆర్డర్లో తను మాత్రమే బెస్ట్ ఆప్షన్ అని గౌతమ్ గంభీర్ లాంటి వాళ్లకు అర్థమయ్యేలా చెప్పగలిగాడు. హాఫ్ సెంచరీ చేయలేక పోయినప్పటికీ.. హార్దిక్ పాండ్యా లాగా భీకర సిక్సర్లు కొట్టలేకపోయినప్పటికీ.. కేఎల్ రాహుల్ స్థిరంగా ఆడాడు. ఆస్ట్రేలియాకు సరైన సమయంలో సరైన తీరుగా బుద్ధి చెప్పాడు.