IND vs AUS : ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ నాథన్ ఎల్లీస్ ను క్యాచ్ అవుట్ చేయడం ద్వారా.. వన్డేలలో 161 క్యాచ్లను పట్టిన ఆటగాడిగా నిలిచాడు. టీమిండియా తరఫున అత్యధిక క్యాచ్లు అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో శ్రీలంక మాజీ ఆటగాడు మహేళ జయవర్ధన మొదటి స్థానంలో ఉన్నాడు. అతడు ఏకంగా 218 క్యాచ్ లు పట్టి ఈ జాబితాలో మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక టీమిండి ఆటగాడు విరాట్ కోహ్లీ 161 క్యాచ్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ 160 క్యాచ్లతో మూఢస్థానంలో ఉన్నాడు. మహమ్మద్ అజారుద్దీన్ 156 క్యాచ్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ ఆటగాడు రాస్ టేలర్ 142 క్యాచ్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. క్యాచ్లు పట్టిన జాబితాలో ఉన్న ఆటగాళ్లు మొత్తం ప్రపంచ క్రికెట్లో మేటి ఫీల్డర్లుగా ఉన్నారు. వీరిలో టేలర్ మినహా మిగతా వారంతా ఆయా జట్లకు కెప్టెన్లు గా వ్యవహరించడం విశేషం. వారి జట్లకు అద్భుతమైన విజయాలు అందించడం గమనార్హం.
Also Read : ఆస్ట్రేలియాతో మ్యాచ్.. స్టేడియంలో విరాట్ కోహ్లీ డ్యాన్స్ చేస్తే ఎట్లా ఉంటుందో తెలుసా?
పాదరసం లాగా
టీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ ఫీల్డింగ్లో అదర్ కొడతాడు. మైదానంలో పాదరసం లాగా కదులుతాడు. బ్యాటింగ్ లో మాత్రమే కాదు.. ఫీల్డింగ్ లో అదరగొడతాడు. ఇప్పటికే ఎన్నో క్యాచ్ లు పట్టిన అతడు.. టీమిండియా సాధించిన విజయాలలో ముఖ్య భూమిక పోషించాడు. ఇక సెమి ఫైనల్ మ్యాచ్లో ఆస్ట్రేలియా 264 పరుగులకు ఆల్ అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ లో స్మిత్ 73 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. క్యారీ 61 పరుగులు చేశాడు. హెడ్ 39 రన్స్ చేశాడు. వీరి ముగ్గురి వల్ల ఆస్ట్రేలియా ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. మహమ్మద్ షమి మూడు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలా రెండు వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ సాధించారు.
ఈ మైదానంలో టీమిండియా ఇప్పటికే మూడు విజయాలు సాధించింది. హ్యాట్రిక్ గెలుపులతో గ్రూపు ఏ లో మొదటి స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్ పై ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ జట్టుపై కూడా ఆరు వికెట్ల తేడాతో గెలుపు సొంతం చేసుకుంది. ఇక న్యూజిలాండ్ పై కూడా అదే స్థాయిలో విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో సెమి ఫైనల్ మ్యాచ్లో తలపడుతోంది. బంతి అనూహ్యంగా టర్న్ అవుతున్న నేపథ్యంలో మ్యాచ్ హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది.
Also Read : పాకిస్తాన్ తో మ్యాచ్ అనగానే విశ్వరూపం చూపిస్తున్న విరాట్.. మేమేం చేశామని పాకిస్తానీ ట్వీట్ వైరల్