https://oktelugu.com/

సిడ్నీ టెస్ట్: గోడకట్టిన అశ్విన్, విహారి.. ఛాన్స్ మిస్ చేసిన టీమిండియా

టీమిండియా అద్భుతమే చేసింది. బుల్లెట్ లాంటి ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకొని ఏకంగా డ్రా చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడున్నర గంటల పాటు రన్స్ చేయకుండా ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకొని మరీ భారత్ డ్రాచేసుకోవడంలో భారత క్రికెటర్లు అశ్విన్, హనుమ విహారి కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ వికెట్లకు గోడ కట్టి భారత్ ఓడిపోకుండా కాపాడారు. నిజానికి పంత్ కనుక ఔట్ కాకుండా ఉంటే ఆస్ట్రేలియా విధించిన 400 పైచిలుకు లక్ష్యాన్ని టీమిండియా ఛేధించేందే.. కానీ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 11, 2021 / 01:14 PM IST
    Follow us on

    టీమిండియా అద్భుతమే చేసింది. బుల్లెట్ లాంటి ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకొని ఏకంగా డ్రా చేసింది. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడున్నర గంటల పాటు రన్స్ చేయకుండా ఆస్ట్రేలియా బౌలర్లను కాచుకొని మరీ భారత్ డ్రాచేసుకోవడంలో భారత క్రికెటర్లు అశ్విన్, హనుమ విహారి కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ వికెట్లకు గోడ కట్టి భారత్ ఓడిపోకుండా కాపాడారు.

    నిజానికి పంత్ కనుక ఔట్ కాకుండా ఉంటే ఆస్ట్రేలియా విధించిన 400 పైచిలుకు లక్ష్యాన్ని టీమిండియా ఛేధించేందే.. కానీ అతడు ఔట్ కావడం.. హనుమ విహారికి గాయం కావడంతో ఇక డ్రాకే మొగ్గు చూపించింది. ఒకవేళ టీమిండియా ఈ లక్ష్యాన్ని చేధించి ఉంటే టెస్ట్ క్రికెట్ లోనే అదో చరిత్ర అయ్యే అవకాశం ఉండేది.

    పూజారా, పంత్ కనుక మరికొద్ది సేపు ఉంటే భారత్ గెలిచేదే. కానీ ఔట్ కావడంతో విహారి, అశ్విన్ లు డ్రా కోసమే ఆడారు. విహారీ గాయంతో బాధపడుతూనే బ్యాటింగ్ చేశాడు. సింగిల్స్ కూడా తీసే పరిస్థితి లేకపోవడంతో డిఫెన్స్ ఆడాడు.

    అశ్విన్, పంత్ లు ఏకంగా 45 ఓటర్ల పాటు బ్యాటింగ్ చేసి కేవలం 62 పరుగులు మాత్రమే చేశారు. సింగిల్స్ తీసే అవకాశం వచ్చినా చేయకలేపోయారు. విహారి పరిగెత్తే అవకాశం లేకపోవడంతో స్కోర్ బోర్డుపై పరుగులు రాలేదు. ఫోర్లు కొడితేనే పరుగులు వచ్చాయి. ప్రస్తుతం డ్రాతో సిరీస్ 1-1తోనే ఉంది. నాలుగో టెస్ట్ కీలకంగా మారింది.