Pawan Kalyan : సుడిగాలి సుదీర్ హోస్ట్ గా తెలుగు ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా లో సర్కార్ 4 షో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాల్లో హీరోగా మారిన సుడిగాలి సుదీర్ మళ్ళీ ఈ షో కి హోస్ట్ గా వ్యవహరించడం అనేది నిజంగా ఒక మంచి విషయమనే చెప్పాలి. ఇక జబర్దస్త్ నుంచి ఎప్పుడైతే తను అవుట్ అయిపోయాడో అప్పటినుంచి తన అభిమానులు తనని చూడాలని చాలా ఈగర్ గా వెయిట్ చేశారు. ఇక అలాంటి సందర్భంలోనే ఈ షో లో సుధీర్ మళ్లీ కనిపించడం అనేది వాళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది.
ఇక ఇదిలా ఉంటే సర్కార్ షో ఎపిసోడ్ 11 ప్రోమో రిలీజ్ అయింది. ఈ ఎపిసోడ్ లో అనసూయ, మనో, బాబా భాస్కర్, గీతా మాధురి లాంటి సెలబ్రిటీలు పాల్గొన్నారు. ఈ ప్రోమో ను కనక చూస్తే మొదటి నుంచి చివరి వరకు చాలా ఫన్నీగా సాగింది. ప్రోమో చివర్లో ఒక ఆసక్తికరమైన క్వశ్చన్ ని సుడిగాలి సుదీర్ అడిగినట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అది ఏంటి అంటే 2024 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ను తను అడిగినట్టుగా తెలుస్తుంది.
అదేంటి అంటే పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆయన్ని ‘అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము’ అంటూ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు అని అడగబోతున్నట్టుగా తెలుస్తుంది. నిజానికి వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన కామెంట్లు చేశారు. ఇక అధికారం లో ఉన్న మంత్రులు వరుస పెట్టి మరి పవన్ కళ్యాణ్ ని కామెంట్లు చేయడమే పని గా పెట్టుకున్నారు. ఇక అందులో ముఖ్యంగా మంత్రి రోజా అయితే పవన్ కళ్యాణ్ ని నానా రకాలుగా తిట్టారు. ఇక ఆమె ముందుగా పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ కొన్ని వాక్యాలైతే చేశారు.
ఇక ఆ పార్టీలో ఉన్న మిగితా మంత్రులు సైతం దాన్ని ఆసరాగా చేసుకొని ఆ పార్టీలో ఉన్న మంత్రులైన కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, అమర్నాథ్ లాంటి మంత్రులు పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ అతన్ని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అంటూ వ్యాఖ్యలైతే చేశారు. ఇక అంతకుముందు పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీ గేటు తాకనివ్వము అని అన్న వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పుడు అసెంబ్లీలో లేరు వాళ్ళందరూ ఓడిపోయి తీవ్రమైన బాధలో ఉన్నట్టుగా తెలుస్తుంది… ఇక మొత్తానికైతే ఈ షో ద్వారా మరొకసారి పవన్ కళ్యాణ్ గొప్పతనం గురించి తెలిపే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…