IND vs AFG : అప్ఘనిస్తాన్ తో టీమిండియా 3వ టీ20 మ్యాచ్ అద్భుతంగా సాగింది. రెండు జట్లు విజయం కోసం తుదికంటా పోరాడాయి. నరాలు తెగే ఉత్కంఠ నడుమ రెండు టీంలు కొదమ సింహాల్లా తలపడ్డాయి. దీంతో బెంగళూరు చిన్న స్వామి స్టేడియం మోత మోగిపోయింది.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియాకు 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడగా.. కెప్టెన్ రోహిత్ శర్మ 69 బంతుల్లోనే 121 పరుగులు చేసి ఏకంగా 212 పరుగుల భారీ స్కోరు అందించాడు. ఇక రోహిత్ కు జతగా మరో ఎండ్ లో 69 పరుగులతో రింకూ సింగ్ రెచ్చిపోవడంతో భారత్ భారీ స్కోరు కారణమైంది.
ఇప్పటికే రెండు టీ20 మ్యాచ్ లు ఓడిన అప్ఘనిస్తాన్ మూడో మ్యాచ్ లో పట్టుదలతో పోరాడింది.గుర్బాజ్ 50, జద్రాన్ 50, గులాబ్ దిన్ 55 పరుగులతో దంచి కొట్డడంతో ఏకంగా మ్యాచ్ ను టై చేసుకుంది. 212 పరుగులకే అప్ఘనిస్తాన్ పరిమితమైపోయి మ్యాచ్ టై అయ్యింది.
ఇక అనంతరం తొలి సూపర్ ఓవర్ లో అప్ఘనిస్తాన్ 17 పరుగులు చేయగా.. టీమిండియా కూడా 17 పరుగులే చేసి డ్రా అయ్యింది.
ఇక రెండో సూపర్ ఓవర్ లో టీమిండియా 11 పరుగులు చేయగా.. అప్ఘనిస్తాన్ 1 పరుగే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. రెండో సూపర్ ఓవర్ లో రెండు వికెట్లు తీసిన స్పిన్నర్ రవి బిష్నోయ్ భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు. రెండు సూపర్ ఓవర్లలోనూ సిక్సర్లతో రోహిత్ శర్మ విరుచుకుపడడం విశేషం.
మొత్తంగా బెంగళూరులో ప్రేక్షకులు, టీవీలు చూసిన వారు నరాలు తెగేలా రెండు జట్లు కొట్లాడిన తీరు, మజా పంచినందుకు హర్షం వ్యక్తం చేశారు. అప్ఘనిస్తాన్ ఓడినా కూడా అందరి తన పోరాటంతో అందరి మనసులు గెలుచుకుంది.