క్రీడలుIndia vs Pakistan MMA: భారత ఫైటర్ దెబ్బ అట్లుంటది.. 80 సెకండ్లలో పాక్ ఫైటర్...

India vs Pakistan MMA: భారత ఫైటర్ దెబ్బ అట్లుంటది.. 80 సెకండ్లలో పాక్ ఫైటర్ అవుట్

India vs Pakistan MMA: అది మామూలు దెబ్బ కాదు.. పులి పంజా దెబ్బకు.. సింహం గర్జనకు సమానం. ఏనుగు తొండంతో లాగి పెట్టి కొడితే ఎలా ఉంటుందో.. ముసలి తన దంతాలను ఏకబిగిన బిగించి లాగేస్తే ఎలా ఉంటుందో.. బలమైన పొట్టేలు కొమ్ములతో గుద్దితే ఎలా ఉంటుందో.. హోరుగాలి అమాంతం లేపేస్తే ఎలా ఉంటుందో.. అలా ఉంది.. ఆ దెబ్బ తిన్నవాడు.. బతకలేడు.. బతికినా లేవలేడు. అదే పరిస్థితి పాకిస్తాన్ ఫైటర్ ఎదుర్కొన్నాడు. మన ఫైటర్ ఇచ్చిన పంచ్ కు చుక్కలు చూసి.. కింద పడిపోయాడు.

మనదేశంలో పంజాబ్ ప్రజలు చాలా బలంగా ఉంటారు. అక్కడి ప్రజలు ఎక్కువగా కుస్తీ పోటీలకు.. మార్షల్ ఆర్ట్స్ కు ప్రాధాన్యమిస్తుంటారు. అలాంటి గడ్డమీద పుట్టిన వ్యక్తి పేరు సంగ్రామ్ సింగ్. ఇతడు మార్షల్ ఆర్ట్స్ లో చిన్నప్పటినుంచి శిక్షణ పొందాడు. తనను తాను గొప్పగా మలుచుకున్నాడు. అనేక పోటీలలో విజయాలు సాధించాడు. చివరికి ఏషియా చాంపియన్ షిప్ లో అదరగొట్టాడు. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ ఫైటర్ మహమ్మద్ అలీకి తన పంజా దెబ్బ చూపించాడు. మలేషియాలో జరిగిన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైనల్ పోటీలో పాకిస్తాన్ ఫైటర్ మహమ్మద్ అలీ ని ఒకటి దెబ్బకు పడుకోబెట్టాడు. తన పవర్.. టాలెంట్ తో కేవలం 80 సెకండ్లలోనే అతడిని ఓడించాడు.

సంగ్రామ్ సింగ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్లో ఇప్పటివరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. దీనిని బట్టి అతడు ఎలా ఆడతాడో.. అతడి నేర్పరితనం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ప్రత్యర్థి కదలికలను అతడు ముందుగానే కనిపెడతాడు. ప్రత్యర్థి పంచ్ ల నుంచి తనను తాను రక్షించుకుంటాడు. ఇదే సమయంలో ప్రత్యర్థి లోపాల మీద దృష్టి పెడతాడు. ఎప్పుడైతే వాటి మీద అతనికి పట్టు చిక్కుతుందో.. ఇక అప్పుడు తన దాడి మొదలు పెడతాడు. ప్రత్యర్థి ఏమాత్రం కోలుకోకుండా చేస్తాడు. వరుసగా పంచ్ లు విసురుతాడు. వాటి నుంచి తీరుకునే లోగానే గట్టి దెబ్బ కొడతాడు. దీంతో ప్రత్యర్థి కుప్పకూలిపోతాడు.

మలేషియాలో జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్ ఫైటర్ మహమ్మద్ అలీ విషయంలో కూడా ఇదే విధానాన్ని సంగ్రామ్ సింగ్ పాటించాడు. తన పవర్ చూపించాడు. తన టాలెంట్ ప్రదర్శించాడు. కేవలం 30 సెకండ్లలోనే ఆలీని పడుకోబెట్టాడు. దీనిని బట్టి మనవాడి రేంజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అలీ ప్రారంభం నుంచే ఎదురు దాడి చేద్దామనుకున్నాడు. కానీ ఆలీ పప్పులు సంగ్రామ్ సింగ్ మీద ఉడకలేదు. సంగ్రామ్ సింగ్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఫైటర్ లేవలేదు. లేచే అవకాశం సంగ్రామ్ సింగ్ ఇవ్వలేదు. సంగ్రామ్ సింగ్ తో పోల్చి చూస్తే అలీ బలవంతుడు. కానీ.. సంగ్రామ్ ఎత్తుల ముందు చిత్తయ్యాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Tammineni Seetharam: ‘తమ్మినేని ఫ్యామిలీ’ పై క్యూ కడుతున్న బాధితులు!

Tammineni Seetharam: శ్రీకాకుళం జిల్లాలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. మొన్నటి వరకు ఆయన శాసనసభ స్పీకర్గా వ్యవహరించారు. అయితే ఆయనతోపాటు కుటుంబ సభ్యులను నకిలీ...
Exit mobile version